cloudfront

Advertisement


Home > Politics - Gossip

అందరూ పంతుళ్లేనా.. కందుకూరిని తీసేయండి!

అందరూ పంతుళ్లేనా.. కందుకూరిని తీసేయండి!

పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో 49మంది త్యాగమూర్తులను గుర్తించారు. అలా అనడం కంటె, తెలుగు రాష్ట్రాల్లోని 49మంది చారిత్రక వ్యక్తులకు పవన్ గుర్తింపు దక్కే భాగ్యం లభించింది. వారు మాత్రమే మహనీయులు... స్ఫూర్తి ప్రదాతలు. పవన్ గుర్తించని తతిమ్మా వాళ్లంతా కేతిగాళ్లు, పోతురాజులు అన్నమాట. ఘోరమైన సంగతేంటంటే.. సొంతడబ్బా కొట్టుకోవడం, తన డబ్బాను ఇతరులతో కొట్టించుకోవడం చేతకాని పాత రోజుల్లో సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులును పవన్ గుర్తించకపోవడం.

ఈ మహనీయుల జాబితా తయారీ సమయంలో.. ఆయన పేరు ప్రస్తావనకు వచ్చినా కూడా.. ‘‘అందరూ పంతుళ్లేనా పక్కన పెట్టండి..’’ అంటూ పవన్ కల్యాణ్ తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కు ఉన్న సంఘసంస్కరణ అవగాహన మరీ ఇంత చౌకబారుతనంతో కూడినదా... అని విషయం తెలిసిన వారు నివ్వెరపోతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో సంఘసంస్కర్త అనే నిర్వచనానికి ఒదిగే తొలితరం వ్యక్తుల్లో కందుకూరి వీరేశలింగం ప్రముఖులు. స్వాతంత్రోద్యమ కాలంలోనే సమాజంలో ఎన్నిరకాల దురాచారాలు ఉన్నాయో అన్నిటినీ రూపు మాపి.. సమాజానికి ఒక కొత్త దిశను చూపించిన మహనీయుడు ఆయన. తన సొంత ఆస్తిపాస్తులను సమస్తం తగలేసుకున్న వ్యక్తి. సాహిత్యకారుడిగా కూడా ఆయనది తిరుగులేని చరిత్ర. తెలుగులో తొలి నవల కూడా ఆయనదే అని కొందరు పెద్దలు అంటుంటారు. స్వాతంత్ర్య పోరాటంలో.. తెలుగు ప్రాంతాల నుంచి తొలి అడుగులు వేసిన త్యాగమూర్తుల పేర్లలో ఆయనను ముందుగా ప్రస్తావించుకోవాలి.

బ్రిటిషు వాడినుంచి స్వాతంత్ర్యాన్ని సాధించుకోవాలి.. అంటూ కాంగ్రెస్ గట్రా పార్టీలు పుట్టిన తర్వాత.. ఆ పోరాటంలో భాగంగా మారిన తెలుగువారు అనేకులు ఉన్నారు. కానీ, మన సమాజాన్ని సంస్కరించుకోవాలి.. మన సమాజంలో కులాలతో నిమిత్తం లేకుండా వంచనకు గురవుతున్న మనుషుల్ని చైతన్య పరచాలి.. వారిలో చైతన్యం ద్వారానే స్వేచ్ఛ సాధ్యమవుతుంది.. అని కిందినుంచి పైకి స్వాతంత్ర్యాభిలాషను తీసుకువెళ్లిన ప్రాతఃస్మరణీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు.

సమాజోద్ధరణ అంటే.. దళితుల గురించి, బీసీలు అనే వారి గురించి మాట్లాడడం మాత్రమే కాదు, అగ్రవర్ణాల్లో వంచనకు గురవుతున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు.. వారందరి గురించీ పనిచేయడమే అని ఆయన నిరూపించారు. అన్నిరకాల మహానుభావుడు అయిన కందుకూరి వీరేశలింగం గురించి.. ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే... సినిమా హీరో పవన్ కల్యాణ్ దృష్టిలో మాత్రం ఆయన కృషి మన్ననకు నోచుకోలేదు.

కందుకూరి పేరు ప్రతిపాదన వచ్చినప్పుడు.. ‘అందరూ పంతుళ్లేనా.. ఆయన పేరు తీసేయా’లని పవన్ ఎందుకు అన్నారో తెలియదు. పంతుళ్ల మీద అంత ద్వేషం ఉంటే.. మరో పంతుల్ని తీసేయాల్సింది. అలా కాకుండా.. సమాజం కోసం తన సమస్తమూ ధారపోసిన వాడిని.. గుర్తించడానికి.. ఇంత సంకుచితంగా మాట్లాడడమే చిత్రంగా అనిపిస్తోంది.