Advertisement

Advertisement


Home > Politics - Gossip

భూములు తిరిగిస్తే పోరాటం చచ్చినట్టే!

భూములు తిరిగిస్తే పోరాటం చచ్చినట్టే!

అమరావతి ప్రాంత రైతులు కొందరు.. రాజధాని తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. అదే సమయంలో మరికొందరు రైతులు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. అభివృద్ధి చేసే అవకాశం లేనప్పుడు తమ భూములను తమకు తిరిగి ఇచ్చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెడుతున్నారు. అలాగే భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నందువల్ల.. తమ నిత్యజీవితంలో శుభకార్యాలు చేసుకోవడానికి కూడా డబ్బు సర్దుబాటు కాక ఇబ్బందులు పడుతున్నాం అని నివేదిస్తున్నారు. అంటే క్రయవిక్రయాలపై నిషేధం ఎత్తేయాల్సిందిగా కూడా కోరుతున్నారు.

స్థానిక రైతుల ఇలాంటి కోర్కెలను మన్నిస్తున్నట్లుగా ప్రకటించి.. ప్రభుత్వం ఆమేరకు నిర్ణయం తీసుకున్నదంటే గనుక.. అక్కడితో అమరావతి పరిరక్షణ పోరాటం చచ్చూరుకుంటుంది. భూములు ఇచ్చిన రైతులు నూరుశాతం.. ప్రస్తుతం పోరాటంలో లేరు. కొందరి భాగస్వామ్యంతోనే ఆ పోరాటాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం రాజధాని తరలింపునకు ఎటూ నిర్ణయం తీసుకున్నది గనుక.. ముందే మేలుకుని తక్కువ నష్టంతో బయటపడదాం అనే ఆలోచనతో పలువురు అడుగులు కదుపుతున్నారు. అలాంటి వారంతా భూముల్ని తిరిగి  ఇవ్వాల్సిందిగా, క్రయవిక్రయాల నిషేధం ఎత్తేయాల్సిందిగా కోరుతున్నారు.

ఆ నిర్ణయాలు ప్రభుత్వం నుంచి వస్తే.. రాజధానికి గతంలో సేకరించిన భూమిలో చీలికలు వచ్చినట్లే అవుతుంది. మధ్యమధ్యలో అక్కడక్కడా స్థలాలు మళ్లీ ప్రెవేటు ప్రాపర్టీలు అవుతాయి. కేవలం భూమిలో చీలికలు మాత్రమే కాదు.. అమరావతి రాజధాని కోసం జరుగుతున్న పోరాటంలో కూడా చీలికలు వచ్చేస్తాయి. దీంతో ప్రభుత్వానికి ప్రయాస తగ్గుతుంది. వారి బాటలోనే మిగిలినల వారికి కూడా న్యాయం చేసేస్తాం.. మీ భూములు మీరు తీసుకోండి... అని ప్రకటిస్తే సగం పోరాటం మెత్తబడిపోతుంది.

రాజధాని రైతులతో బొత్స సమావేశం అయ్యాక.. ఒక ప్రకటన వచ్చింది. పాతప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు భూములను అభివృద్ధి చేసి ఇస్తాం అనే మాట మాత్రం ప్రభుత్వం చెబుతోంది. రాజధాని గురించి కమిట్ కావడం లేదు. రాజధాని లేకుండా కేవలం తమ స్థలాల్లో వాటా మాత్రమే తీసుకునేకంటే.. మొత్తం స్థలం వెనక్కి ఇచ్చేయమని అడిగితే మేలు కదా అనే మీమాంసలో కొందరున్నారు. రైతులు ఇలాంటి సందిగ్ధంలో ఉండగానే.. ప్రభుత్వం తలపెట్టిన కార్యం పూర్తయ్యేలా కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?