Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆ 150 కోట్లకూ 'అమరావతి' కి లింక్?!

 ఆ 150 కోట్లకూ 'అమరావతి' కి లింక్?!

ప్రభుత్వ సంబంధ కాంట్రాక్టులకు సంబంధించి నకిలీ బిల్లులు సృష్టించి.. వేల కోట్ల రూపాయల డబ్బులను కొన్ని కాంట్రాక్టు సంస్థలు పొందిన వైనం గురించి ఐటీ దాడుల వివరాలను ఏపీలో ఒక ప్రధాన వర్గం మీడియా అసలు ప్రస్తావించడం లేదు.

ఇది వరకూ అయితే సీబీఐ-ఈడీ వార్తల విషయంలో అదిగో తోక అంటే, ఇదిగో పులి అన్నట్టుగా  వాటి హడావుడి ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ఒక వర్గం మీడియా కిక్కురుమనడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ఆ కుంభకోణం మూలాలు అమరావతిలో కదులుతూ ఉండటమే అనే టాక్ వినిపిస్తోంది.

అమరావతిలో రూ. 2,652 కోట్ల పనులకు సంబంధించి ఓ కంపెనీ నాటి ముఖ్యనేతకు అందచేసిన సొమ్ము ఆధారాలు ఐటీ అధికారుల చేతికి చిక్కాయనేది మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.  మొత్తం నూటా యాభై కోట్ల రూపాయల మొత్తం నాటి ఆ 'ముఖ్య నేత'కు అందిందని వార్తలు వస్తున్నాయి.

ఈ కుంభకోణం ఏపీలో కూడా సాగిందని ఐటీ వర్గాలు  అధికారికంగా ధ్రువీకరించాయి. మొత్తం 3,300 కోట్లు పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయని ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఓ ముఖ్యనేతకు 150 కోట్లు అందినట్లు స్పష్టమైన సమాచారం తమ వద్ద ఉన్నట్లు పేర్కొంది.

ముంబైకి చెందిన ఒక కంపెనీ నుంచి నాటి ముఖ్య నేతకు ఆ డబ్బు అందినట్టుగా ఐటీ వర్గాలు గుర్తించాయని తెలుస్తోంది. దాదాపు 700 కోట్ల చెల్లింపుల్లో 150 కోట్ల రూపాయలు అధికారికంగా చేతులు మారినట్లు ఐటీ సోదాల్లో స్పష్టమైందట. ఆ కంపెనీ అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణంలో పాలుపంచుకున్నట్టుగా తెలుస్తోంది.

అమరావతిలో భవనాల నిర్మాణ నాణ్యత ఏమిటో అప్పట్లోనే బయటపడింది. అవి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలు! ఏ మాత్రం నాణ్యత లేకుండా వాటిని నిర్మించారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించే ఇప్పుడు అసలు కథ బయటకు రానుందని, ముఖ్య నేత అవినీతి కూసాలు కదులుతూ ఉన్నాయని భోగట్టా.

ఐటీ దాడుల వ్యవహారంలోనే సదరు నేత జుట్టు పూర్తిగా ఢిల్లీ వారి చేతిల్లోకి చిక్కిందని, ఆయనను జైలు పంపడానికి ఈ ఒక్క అంశం చాలని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది చిన్నది మాత్రమే అని, ఆ ముఖ్య నేత కు సంబంధించి మరిన్ని కూపీలు లాగి, ఆయనను ఒకేసారి జైలుకు పంపే  ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని వార్తలు వస్తూ ఉండటం  గమనార్హం. ఈ పరిస్థితిని గమనించే ఆయన కొందరి కాళ్ల మీద పడటంలో బిజీగా ఉన్నారనే ప్రచారమూ సాగుతూ ఉంది! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?