cloudfront

Advertisement


Home > Politics - Gossip

‘అనంత’ తాయిలాలు : ఓ చీర తీసుకో చెల్లీ!

‘అనంత’ తాయిలాలు : ఓ చీర తీసుకో చెల్లీ!

అనంతపురం జిల్లాలో అప్పుడే అధికార తెలుగుదేశం పార్టీ... ఎన్నికల ప్రలోభాలకు తెరతీసింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఓటర్లపై నేతలు, ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు. మగవారి ఓట్లకోసం ప్రత్యేకమైన ప్రలోభాలు ఎటూ ఉంటాయి గనుక... సరిగ్గా ఎన్నికల సమయం ముంచుకువచ్చాక... అవి ఎటూ తప్పవు గనుక... వాటిపై ధీమా ఉన్న దేశం నాయకులు.. మహిళల ఓట్ల కోసం ఇప్పటి నుంచే పంపిణీ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యే.. పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే సూరి... ఇప్పటికే మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టేశారు.

వచ్చే ఎన్నికలలో పోటీచేయమని చెబుతున్న జేసీ సోదరులు... తమ కుమారులైన అస్మిత్ రెడ్డి.. పవన్ కుమార్ రెడ్డి లతో కలిసి.. చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేసారు. తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మహిళా ఓటర్లకందరికీ... చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాదాపు 88 వేలమంది మహిళా ఓటర్లున్న తాడిపత్రి నియోజక వర్గం మొత్తం మహిళా ఓటర్లందరికీ.. చీరలు పంచే ఏర్పాట్లు వేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

మహిళా సెంటిమెంట్ అయితే బాగా పనిచేస్తుందని... ఇప్పటినుంచే పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలోని.. యాడికి మార్కెట్ యార్డులో.. దాదాపు ఒకేసారి.. పదివేల మంది మహిళలకు, ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో పసుపు కుంకుమ కార్యక్రమం పేరుతో చీరలు పంపిణీ చేశారు. సభకు వచ్చిన వారందరికీ.. బిర్యానీతో విందు కూడా ఏర్పాటు చేశారు.

సభలో.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి... పనితీరును మెచ్చుకుంటూ మాట్లాడిన మహిళలకు ప్రత్యేకంగా నగదు పంపిణీ కూడా చేశారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తమ వారసులైన అస్మిత్ రెడ్డి.. పవన్ కూమార్ రెడ్డిలను ఆశీర్వదించాలని... ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళలకు విన్నపం చేయడం జరిగింది.

విపక్షాలు మాత్రం.. జేసీ బ్రదర్స్ అందిస్తున్న తాయిలాలపై మండిపడుతున్నాయి. జేసీ సోదరులు... ప్రజల ఆస్తులను దోచుకుని, ఇప్పుడు వారికి నూకలు విదిలిస్తున్నారని... స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి జేసీ బ్రదర్స్ అందిస్తున్న తాయిలాలు.. వారికి ఓట్లు రాలుస్తాయో... లేదో.. ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

కేసీఆర్ ఫ్రంట్ ఇక అంతేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్