cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబుకు షాక్ ఇవ్వబోతున్న తెలుగు యువత

బాబుకు షాక్ ఇవ్వబోతున్న తెలుగు యువత

పింఛన్లు పెంచాను వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అంతా నావైపే అంటున్నారు చంద్రబాబు. 10వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తున్నాను డ్వాక్రా మహిళలంతా తనవెంటే అనుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, లోన్లు తీసుకుంటున్నవాళ్లు.. అందరూ అండగా ఉంటారని ఆశిస్తున్నారు. ఆయా వర్గాలన్నీ చంద్రబాబుపై అంతో ఇంతో కనికరం చూపొచ్చుగానీ యువత మాత్రం పూర్తిగా టీడీపీకి దూరమైంది.

గత ప్రభుత్వాలతో పోల్చిచూస్తే 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటినుంచి నేటి వరకు అతి తక్కువ ఉద్యోగ నియామకాలు జరిగాయి. తెలంగాణతో పోల్చిచూసినా మన రాష్ట్రంలో నోటిఫికేషన్లు, రిక్రూట్ మెంట్లు చాలా తక్కువ. ఏపీపీఎస్సీని పూర్తిగా నిర్వీర్యం చేసిన చంద్రబాబు ఉద్యోగాల భర్తీని గాలికొదిలేశారు.

కనీసం ఎన్నికల ఏడాదిలో అయినా నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో ఖాళీలు భర్తీ కావడంలేదు. నిరుద్యోగ భృతి అంతా టీడీపీ అనుబంధ సభ్యుల జేబుల్లోకే వెళ్లిపోతోంది. పార్టీతో సంబంధం లేని వారెవరికీ భృతి దక్కడంలేదు. మరోవైపు కక్షగట్టి ఓటరు లిస్టులో నుంచి పేర్లు తొలగిస్తున్నారు.

ఈ పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీని ప్రజల్లో చులకన చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువత.. ఈసారి వైసీపీవైపే మొగ్గు చూపుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ కూడా యువతపైనే దృష్టిపెట్టి ప్రచారం చేస్తున్నారు. కొత్త మొహాలను పరిచయం చేస్తూ.. ఇప్పటివరకూ ఎన్నికలకు దూరంగా ఉంటున్న వారిని పోలింగ్ బూత్ కు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల తొలగింపుపై వైసీపీ చేస్తున్న పోరాటానికి యువత మద్దతు తెలుపుతోంది. ఢిల్లీ స్థాయిలో వైసీపీ అధినేత జగన్ పోరాటం చేస్తుండగా.. నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ ల చొరవతోనే కొన్ని ఓట్లయినా తిరిగి జాబితాలో చేరాయి.

ఎక్కడికక్కడ స్థానికంగా కొత్త ఓటర్లు వైసీపీవైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తాయిలాలు ప్రకటించి గెలుపుపై ధీమాగా ఉన్న చంద్రబాబుకి రాష్ట్ర యువత గట్టిగా షాక్ ఇవ్వబోతోందని విశ్లేషకులంటున్నారు.

అనంతపురంలో వీళ్లు ఔట్?... కర్నూలులోనూ అదే కథ!

రెండు భారీ డిజాస్టర్లలో ఒకటైన ఎన్టీఆర్‌ కథానాయకుడు