cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఏపీలో సంక్రాంతి: గులాబీ 'వేగులు' సిద్ధం

ఏపీలో సంక్రాంతి: గులాబీ 'వేగులు' సిద్ధం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వేలుపెట్టి, తెలంగాణ రాష్ట్ర సమితికి 'గిఫ్ట్‌' ఇచ్చిన దరిమిలా, తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీకి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వనున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. ఇంతకీ ఆ గిఫ్ట్‌ ఏంటి.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. అయితే, గిఫ్ట్‌కి సంబంధించి అప్పుడే తెరవెనుక వ్యవహారం షురూ అయ్యిందట. ఈ క్రమంలోనే, 'గులాబీ వేగులు' ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి సంబరాలనగానే, ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ గుర్తుకువచ్చేది కోడిపందాలే. కోట్లు, వందలకోట్లు ఈ కోడి పందాల్లో చేతులు మారుతుంటాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌. సుప్రీంకోర్టు నిషేధం వున్నా, అధికార పార్టీ నేతలు.. ఒక్కోసారి మంత్రులు కూడా ఈ కోడి పందాల్ని దగ్గరుండి నిర్వహిస్తుంటారు. పొరుగు రాష్ట్రాల నుంచీ ఈ కోడి పందాల్ని తిలకించేందుకు, వీటిల్లో పాల్గొనేందుకు పెద్దయెత్తున ప్రముఖులు వస్తుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే.

తెలంగాణ రాష్ట్రం నుంచి, పలువురు రాజకీయ ప్రముఖులు ఏపీ సంక్రాంతి కోడి పందాల్లో పాల్గొంటుండడం చూస్తూనే వుంటాం. ఈసారి అలా వెళ్ళే తెలంగాణ ప్రజా ప్రతినిథులతోపాటు, అదనపు 'ప్రముఖులు' కూడా కోడి పందాల్లో హల్‌చల్‌ చేయబోతున్నారట.

జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి ఆలోచిస్తోన్న కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనూ తలదూర్చాలని ఫిక్సయ్యారు. అదెలాగన్నదానిపై కేసీఆర్‌ మల్లగుల్లాలు పడ్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితిని అంచనా వేసేందుకు, 'సంక్రాంతి సంబరాలు' సరిగ్గా ఉపయోగపడ్తాయని కేసీఆర్‌ భావిస్తున్నారట.

మరోపక్క, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావుకి, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోని సెటిలర్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో వుంటుంటారు కూడా కేటీఆర్‌. అలా తనకు అత్యంత సన్నిహితులైనవారినే 'వేగులు'గా కేటీఆర్‌ నియమించారనే ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా వుండబోతోందన్నదానిపై కేటీఆర్ మాత్రమేకాదు, కేసీఆర్‌ కూడా ఓ అవగాహనతో వున్నారు. వైఎస్సార్సీపీనే అధికార పీఠమెక్కుతుందని కేసీఆర్‌ గట్టిగా నమ్ముతున్నారు. ఆ పార్టీకి మరింత ఊతమివ్వడం ద్వారా టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేయొచ్చన్నది కేసీఆర్‌ వ్యూహం.

అయితే, కేసీఆర్‌ మద్దతు తీసుకునే విషయమై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఒకింత తటపటాయిస్తున్న విషయం విదితమే. ప్రత్యక్షంగా టీఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదు. కానీ, టీడీపీని దెబ్బకొట్టేందుకు అవసరమైతే వైసీపీకి మద్దతివ్వడమో, లేదంటే పవన్‌కళ్యాణ్‌కి మద్దతివ్వడమో చేయనుందన్నది నిర్వివాదాంశం.

చూద్దాం, ఏం జరుగుతుందో.. గులాబీ వేగులు సేకరించే 'సంక్రాంతి సమాచారం' ఎలా వుండబోతోందో.!

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

అటు జనం.. ఇటు భయం, పవన్ ఒంటరిగా వెళ్లాలి.. ఇదే అభిమానుల కోరిక!