Advertisement


Home > Politics - Gossip
ఆశ, నిరాశ.. మోడీజీ దేశానికి ఏది దిశ?

ఆశ నిరాశగా మిగిలిపోయింది. నమ్మకాలు వమ్మ య్యాయి. అరచేతిలో స్వర్గం చూపించేశారు. మీడియాని విచ్చలవిడిగా వాడేశారు. మూడున్న రేళ్ళ క్రితం మొదలైన పబ్లిసిటీ స్టంట్‌ ఇప్పటికీ అలా కొనసాగుతూనే వుంది. అప్పుడేమో అహో మోడీ.. ఇప్పుడూ పబ్లిసిటీ పరంగా 'అహో మోడీ' అన్నట్లుగానే వుంది. 'మేడిపండు' చందాన, పైన చూస్తే అద్భుత.. వాస్తవం చూస్తే మాత్రం భయానకం.! నరేంద్రమోడీ మూడున్న రేళ్ళపాలనలో ఏమున్నది గర్వకారణం? దేశంలో రాజకీయ విలువలు మరింతగా అదఃపాతా ళానికి వెళ్ళిపోయాయి. అవినీతి పతాకస్థాయికి చేరిపోయింది. అయినా, నిరాశావాదం వద్దనీ.. కొందరు నిరాశావాదుల్ని నమ్మొద్దన్నీ ఇంకా నరేంద్రమోడీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తూనే వున్నారు.

మాయ.. అంతా రాజకీయ మాయ.!

గుజరాత్‌ అభివృద్ధి మోడల్‌.. అదొక్కటీ చాలు, దేశంలో భారతీయ జనతా పార్టీని నరేంద్రమోడీ గట్టెక్కిం చేస్తారనీ, బీజేపీని అధికారంలోకి తీసుకురావ డమే కాదు, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తి నరేంద్రమోడీ మాత్రమేనని బీజేపీ నమ్మింది. బీజేపీ నమ్మడమే కాదు, దేశ ప్రజల్నీ నమ్మిం చింది. పదేళ్ళ కాంగ్రెస్‌ పాలనలో దేశం అనేక కుంభకోణాల్ని చూసేసింది. దాంతో, సహజం గానే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి గురించి ఆలోచించింది.

అది నరేంద్రమోడీయేనని దేశ ప్రజానీకం ముక్తకంఠంతో నినదించింది. ఫలి తం, 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య మెజార్టీతో విజయం సాధించి, కేం ద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు మొదలైంది అసలు రాజకీయ క్రీడ. దేశంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్నీ తన అదుపులోకి తెచ్చుకునేం దుకు నరేంద్రమోడీ ప్రకటించారు. తమంతట తాముగా వస్తే సరి, లేదంటే మాత్రం 'బల ప్రయోగం' తప్పదన్నట్టు వ్యవహరించారు.

తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌లలో ముఖ్యమంత్రుల్ని మోడీ, ఎలా తన దార్లోకి తెచ్చుకున్నారో ప్రత్యే కంగా చెప్పాల్సిన పనిలేదు. బీహార్‌లో మోడీ ఏం రాజకీయం చేసి, నితీష్‌కుమార్‌ని కాంగ్రెస్‌కి దూరం చేశారన్నది జగమెరిగిన సత్యం. గోవా తదితర రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీ లేక పోయినా, రెండోస్థానం దక్కినా బీజేపీ ఎలా అధికారంలోకి వచ్చిందో చిన్నపిల్లాడినడిగినా చెబుతాడు. వెరసి, గడచిన మూడేళ్ళలో నరేంద్రమోడీ మహా రాజకీయ నాటకానికి తెరలేపారు. ఆ నాటకాన్ని రక్తి కట్టించారు కూడా.!

వంచన - ఇది నయ వంచన

యూపీఏ హయాంలో ధరలు పెరిగాయ్‌.. మేమొస్తే, ధరల్ని తగ్గించేస్తామని దేశ ప్రజానీకాన్ని నమ్మిం చిన నరేంద్రమోడీ, గడచిన మూడున్నరేళ్ళలో ఏం చేసినట్లు.? ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పాతాళానికి పడిపోతే, మన దేశంలో మాత్రం పెట్రోధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. ఖజానా నింపుకోవడం పేరుతో, జనాన్ని నిలువు దోపిడీ చేసేస్తోంది మోడీ సర్కార్‌. 'మేం బాదేస్తున్నాం, మీరూ బాదెయ్యండి..' అని రాష్ట్రాల్ని జనమ్మీదకు ఉసిగొల్పిన మోడీ, గుజరాత్‌ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, రెండ్రూపాయల పన్ను తగ్గించి, 'మేం తగ్గించాం కదా, మీరూ తగ్గించాల్సిందే' అంటూ రాస్ట్రాల్ని ఇరకాటంలో పడేశారు.

పెద్ద పాతనోట్ల రద్దుతో పూర్తిస్థా యిలో దేశ ప్రజానీకాన్ని నరేంద్రమోడీ వంచిం చారు. అవినీతి తగ్గిపోతుందన్నారు, తీవ్రవాదం అంతమైపోతుందన్నారు, నల్లధనం పూర్తిగా వెలుగులోకి వస్తుందన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఏం తేడా వచ్చిందట.! ఓ అంచనా ప్రకారం, నల్లధనం గతంతో పోల్చితే ఇప్పుడు దేశంలో మరింతగా పెరిగిపోయింది.

అవును మరి, 500, 1000 రూపాయల నోట్ల కట్టల్ని దాయడం కంటే, 2 వేల రూపాయల నోట్ల కట్టల్ని దాచేయడం సులువు కదా.! బ్యాంకుల నుంచి జనం వద్దకు వెళ్ళిన 2 వేల రూపాయల నోటు, తిరిగి బ్యాంకుకి చేరుతోందా.? లేదా.? ఈ విషయమై రిజర్వు బ్యాంకు వద్దనే ఖచ్చితంగా లెక్కలు లేని పరిస్థితి. సామాన్యుడేమో బ్యాంకుల్లో వున్న తమ డబ్బు కోసం ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది.అవినీతిపరులు, అక్రమార్కులు మాత్రం దొడ్డిదారుల్లో నోట్ల కట్టల్ని తెప్పించేసుకున్నారు.

అక్కడి అవినీతికి మోడీ అభయహస్తం.!

రాజకీయ అవినీతి.. దేశాన్ని ముంచేస్తోంది. కానీ, పెద్ద పాతనోట్ల రద్దుతో రాజకీయ అవినీతి తగ్గలేదు. పైగా, పెరిగిపోయింది. ఇటీవల దేశంలో జరి గిన చాలా ఎన్నికల్లో డబ్బు ఏరులై పారింది. ఎలా.? నల్లదనం సమూ లంగా నాశనమై పోయిందన్న మోడీ మాటలు నిజమైతే, ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ఎలా ఖర్చు చేయగలు గుతున్నాయి.? ఈ ప్రశ్నకు నరేంద్రమోడీ వద్ద సమాధానమే వుండదు.

జీఎస్‌టీ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా విలవిల్లాడిపో తోంది. ఆర్థికరంగ నిపుణులు ఈ పరిస్థితిని, దేశంలో 'ఎకనమిక్‌ ఎమర్జన్సీ'గా అభివర్ణి స్తోంటే అందర్నీ 'నిరాశావాదులు' అనే గాటన కట్టేస్తున్నారు మోడీ. అంతే, అంత కన్నా ఆయన ఇంకేం మాట్లాడగలరు.? బుకాయింపులకైనా ఓ హద్దు వుంటుంది.. ఆ హద్దుల్ని నరేంద్రమోడీ ఎప్పుడో దాటేశారు.

దేశం విలవిల్లాడిపోతోంది

దేశం ఆర్థికంగా వెలిగిపోవడం సంగతేమోగానీ, విలవిల్లాడిపోతోందిప్పుడు.మేకిన్‌ ఇండియా లేదు, ఇంకోటీ లేదు. అంతా హంబక్‌. మోడీ పబ్లిసిటీ స్టంట్‌ రెండు మూడేళ్ళు బాగానే నడిచింది, ఇప్పుడే వాస్తవం అర్థమవుతోంది. మోడీ మాటల్లో 'మాయ' స్పష్టంగా కన్పిస్తోంది. చూస్తోంటే, దేశ ఆర్థిక వ్యవస్థ మీదగానీ, దేశ భవిష్యత్తు మీదగానీ ఏమాత్రం అవగాహన లేకుం డా, నరేంద్రమోడీ తనకు నచ్చిన రీతిలో వ్యవహరించి, దేశాన్ని భ్రష్టుపట్టించే శారేమో అన్పించకమానదు.

వాస్తవాల గురించి మాట్లాడితే ఎవరైనాసరే, మోడీకి నిరాశావాదులగానే కన్పిస్తున్నారు. మోడీలో ఇంకా ఆశావహ దృక్పథకమే కన్పిస్తుంది. ఎందుకంటే, రాజకీయంగా ఆయనకు ఎదురే లేకుండా పోతోంది కదా.! కానీ, సగటు భారతీ యుడి పరిస్థితేంటి.? రాజకీయమూ మారలేదు, దేశ ఆర్థిక పరిస్థితీ భ్రష్టుపట్టిపోయింది. సగటు భారతీయుడు నిండా మునిగిపోయాడు. 'నమో' అన్నందుకు, నిండా మునిగిపోతామని దేశంలో ఎవరైనా ఊహించారా.? ఊహించి వుంటే, ఈ దుస్థితి దాపురించి వుండేది కాదేమో.!

-సింధు