బాబు బలమైన నాయకుడు కాదా?

రాజుగారి పెద్ద భార్య పతివ్రత అని ఎవరైనా అంటే చిన్న భార్య కాదా? అన్న క్వశ్చను ఎదురుకావడం అన్నది చిరకాలంగా వస్తూనే వుంది. ఇప్పుడు కూడా అలాంటి అనుమానమే ఎదురువుతోంది. సదా బాబుగారి శ్రేయస్సు…

రాజుగారి పెద్ద భార్య పతివ్రత అని ఎవరైనా అంటే చిన్న భార్య కాదా? అన్న క్వశ్చను ఎదురుకావడం అన్నది చిరకాలంగా వస్తూనే వుంది. ఇప్పుడు కూడా అలాంటి అనుమానమే ఎదురువుతోంది. సదా బాబుగారి శ్రేయస్సు కోరే ఆర్కే ఈవారం కాలమ్ లో ఇలా రాసారు.

''… తెలుగు రాష్ట్రాలలో బలమైన నాయకులుగా ఉన్న కేసీఆర్‌, జగన్‌రెడ్డి కేంద్ర పెద్దల వద్ద మాత్రం తలలు వంచుతున్నారు..''

ఈ వాక్యం నిజమే అనుకుందాం..కాస్సేపు. జగన్ కు కేసుల భయంవుంది. అలాగే కేసిఆర్ కు వుండే భయాలు ఆయనకు వున్నాయి. 

అందువల్ల ఆ ఇధ్దరూ హస్తిన పెద్దల ముందు తలలు వంచుతున్నారు అనుకుందాం. మరీ ఈ ఇద్దరి కన్నా సీనియర్ మోస్ట్ నాయకుడు మరొకరు వున్నారని మరిచిపోతే ఎలా? నలభై ఏళ్ల ఇండస్ట్రీ. బోలెడు విషయాల్లో చక్రం తిప్పిన ద్రష్ట. 

2019 ముందు కాలికి స్పేషల్ ఫ్లయిట్ కట్టుకుని మరీ దేశం అంతటా తిరిగి ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలనే ప్రయత్నం చేసి, మోడీతో ఢీ అంటే ఢీ అన్న నాయకుడు. చంద్రబాబు నాయుడు. మరి ఆయన సంగతేమిటి? ఆయన మోడీ ముందు ఇప్పుడు ఎందుకు తలవంచుతున్నారు?

2019లో అధికారం కోల్పోయిన దరిమలా ఇప్పటి వరకు ఆయన మోడీని కానీ కేంద్రంలో అధికారంలో వున్న భాజపాను కానీ పల్లెత్తు మాట అన్నారా? కనీసం నిలదీసే ప్రయత్నం చేసారా? అమరావతి సమస్య కావచ్చు. 

పోలవరం వ్యవహారాలు కావచ్చు. ఒక్కటంటే ఒక్క ప్రశ్న వేయగలిగారా? అసలు ఈ మొత్తం కాలమ్ లో బాబుగారి పరిస్థితి గురించి ఆర్కే ఎందుకు ప్రస్తావించనట్లు? 

అంటే తెలుగునాట బలమైన నాయకుల జాబితాలో నాయుడు లేరా? ఆయనకు పాపం ఏ కేసుల భయం లేదు. మరే విధమైన జంకు లేదు. ఏ కోర్టులోనూ ఆయన కేసులు విచారణకు రావు. 

అలాంటపుడు ఆయనకు ఏమొచ్చే మోడీని నిలదీయడానికి. పోనీ మన రాష్ట్రం సంగతులు వదిలేద్దాం. పంజాబ్ తదితర రాష్ట్రాల్లో రైతులు బలంగా పోరాడుతున్నారు కదా. ఒక సారి వెళ్లి అక్కడ మద్దతు ప్రకటించి రావచ్చు కదా. అక్కడి మట్టిని కూడా కాస్త ముద్దాడి రావచ్చు కదా?

అంటే ఆయన బలమైన నాయకుడు కాదని అనుకోవాలా? అందుకే ఆర్కే బలమైన నాయకుల జాబితాలో బాబు పేరు ప్రస్తావించలేదని అనుకోవాలా?

కృష్ణ..కృష్ణ..అమరావతిపై సరైన ప్రశ్న