cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబు బిస్కెట్లు.. ఈసారి జర్నలిస్టులకు కూడా

బాబు బిస్కెట్లు.. ఈసారి జర్నలిస్టులకు కూడా

ఓ సెక్షన్ మీడియాకు ఎప్పుడో 'చంద్ర'గ్రహణం పట్టింది. ఎల్లో మీడియా, అనుకూల మీడియా, తొత్తు మీడియా.. ఇలా పేరు ఏదైనా కొన్ని పత్రికలు, ఛానెళ్లు బాబు కనుసన్నల్లో నడుస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చంద్రబాబు ఇప్పుడు మిగతా మీడియా సంస్థల్లో ఉన్న జర్నలిస్టులను కూడా ట్రాప్ లోకి లాగుతున్నారు. వాళ్లను కూడా తన దారిలోకి తెచ్చుకునేందుకు "ఇళ్ల స్థలాలు" అనే బిస్కెట్ ను ఎరగా వేశారు. 

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అనే కాన్సెప్ట్ ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా నలుగుతున్న అంశం ఇది. పైగా పత్రికల్లో, టీవీల్లో అస్సలు చర్చకు రాని అంశం కూడా. ఇలాంటి కీలకమైన అంశాన్ని సరిగ్గా ఎన్నికలకు 4 నెలల ముందు తెరపైకి తీసుకొచ్చారు చంద్రబాబు. జిల్లా స్థాయిలో అష్టకష్టాలు పడుతున్న విలేకరుల్ని ఏనాడూ పట్టించుకోని బాబు, ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కసారి కూడా ఇళ్ల స్థలాలపై స్పందించని బాబు.. సరిగ్గా ఎన్నికలకు ముందు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. 

నిజానికి ఇదొక ఎన్నికల స్టంట్ అనే విషయం బుద్ధి ఉన్న ఏ జర్నలిస్టుకైనా అర్థమౌతుంది. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ హడావుడిగా ప్రకటన జారీచేశారు. దీనికి సంబంధించి ఒక వెబ్ సైట్ తెచ్చారు. జర్నలిస్ట్ సంఘాలు ఏది కోరినా వెంటనే ఓకే చెబుతున్నారు. సాధ్యంకాని హామీల్ని కూడా అమలు చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. 

కొసమెరుపు ఏంటంటే.. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపీ జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తారట. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో సంబంధం లేదట. చివరికి అక్రిడేషన్ తో కూడా సంబంధం లేదంటూ ఏపీ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోందంటే ఇందులో మోసాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. 

నిజంగా చంద్రబాబుకు అంత చిత్తశుద్ధి ఉంటే.. అర్హులైన జర్నలిస్టులకు సంబంధించి తొలివిడత జాబితా విడుదల చేయాలి. ఏపీ ప్రభుత్వం అడుగుతున్న అన్ని అర్హతలు ఉన్న జర్నలిస్టులు కొందరు ఉన్నారు. కనీసం వాళ్లకైనా ఇళ్ల పట్టాలు అందజేయాలి. అప్పుడు మిగతా జర్నలిస్టులకూ కాస్త నమ్మకం కుదురుతుంది. అంతేకాని, అర్హులకు కూడా స్థలాలు ఇవ్వకుండా, లేనిపోని ప్రకటనలు, అర్థంలేని సమీక్ష సమావేశాలతో కాలం వెల్లదీస్తే ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. 

ఎన్నికల వరకు జర్నలిస్టుల్ని తమకు అనుకూలంగా మార్చునేందుకు బాబు వేసిన నక్కజిత్తుల మంత్రాంగం ఇది. ఆ తర్వాత షరా మామూలే. ఇళ్ల స్థలాల కోసం విలేకరులంతా మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సిందే. ఈలోగా ఇళ్ల స్థలాలపై మరికొన్ని కోర్టు కేసులు పడతాయంతే.