cloudfront

Advertisement


Home > Politics - Gossip

26 లక్షల విరాళం.. ఎన్ని పాపాలు చేశారేంటి?

26 లక్షల విరాళం.. ఎన్ని పాపాలు చేశారేంటి?

కొన్నాళ్ల కిందట టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక వ్యాఖ్య చేశాడు. అది కూడా ఐఏఎస్ లతో సమీక్షా సమావేశంలో. గుళ్లకు జనాలు పోటెత్తడం గురించి చంద్రబాబు నాయుడు ఆ రోజున అత్యంత అనుచితంగా మాట్లాడారు. జనాలు పాపాలు బాగా చేస్తున్నారని, అందుకే గుళ్లకు వెళ్తున్నారని, అందుకే హుండీలు పెట్టామని.. ఎవరు ఎక్కువ పాపాలు చేస్తే వాళ్లు అంత ఎక్కువ డబ్బు హుండీల్లోకి వేస్తున్నారని.. ఆ రోజున చంద్రబాబు సెలవిచ్చారు.

హిందూ గుళ్లలోని హుండీల గురించి చంద్రబాబు ఇలా మాట్లాడాడు. ఇదే మాటే మరెవరైనా మాట్లాడి ఉంటే.. వాళ్లను హిందూ ద్రోహులుగా ముద్ర వేసే వాళ్లు. హిందూ వ్యతిరేకులే ఇలా మాట్లాడతారని వీర హిందుత్వ వాదులు ధ్వజమెత్తే వారు. అయితే బాధ్యాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు మాత్రం.. హుండీల్లోకి డబ్బులు వేస్తే అది పాపబీతితో అని చెప్పుకొచ్చాడు.

ఎక్కువ పాపాలు చేసే వాళ్లు ఎక్కువ డబ్బులు హుండీల్లోకి వేస్తున్నారని.. దీంతో ప్రభుత్వానికి బాగా ఆదాయం వస్తోందని చంద్రబాబు మురిసిపోతూ చెప్పుకొచ్చారు. బాబు మాటలను తప్పు పట్టే ధైర్యం ఏ హిందుత్వ వాదికి లేకపోయింది. కట్ చేస్తే.. ఆ తర్వాత చంద్రబాబు కుటుంబం చాలా సార్లు హుండీల్లోకి డబ్బులు వేస్తోంది. విరాళాలు ప్రకటించింది.

తాజాగా చంద్రబాబు మనవడి పుట్టిన రోజు సందర్భంగా బాబు కుటుంబం టీటీడీకి 26లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. నిత్యాన్నదాన పథకం కోసం.. ఒక రోజు భక్తులకు అన్న ప్రసాదాన్ని పెట్టడానికి చంద్రబాబు కుటుంబం ఈ విరాళాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మరి ఇరవై ఆరు లక్షల రూపాయల విరాళం అంటే.. ఇంతకీ ఎన్ని పాపాలు చేసినట్టు? పాపాలు చేసిన వాళ్లే హుండీల్లోకి డబ్బులు వేస్తున్నారని.. చంద్రబాబే స్వయంగా చెప్పారు. మరి ఆయన కుటుంబానికి కూడా ఆ మాటలు వర్తించవా?

దేవాన్ష్ జ‌న్మదినం సంద‌ర్భంగా తిరుమ‌ల‌లో సీఎం కుటుంబస‌భ్యులు ఫొటోస్ కోసం క్లిక్ చేయండి