cloudfront

Advertisement


Home > Politics - Gossip

జగన్ కు ఏకలవ్య శిష్యుడిలా మారిన బాబు

జగన్ కు ఏకలవ్య శిష్యుడిలా మారిన బాబు

ఎప్పుడూలేనిది చంద్రబాబులో ఎన్నికల భయం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. లేకపోతే నల్లచొక్కా వేసుకోవడం ఏంటి? ఖాకీ యూనిఫామ్ ధరించి ఆటో ఎక్కడమేంటి? చంద్రబాబు వేటికయితే దూరంగా ఉంటున్నారో అవన్నీ చేస్తూ వస్తున్నారు. అమరావతి విషయంలో చేసిన అసత్య ప్రచారాలు, ప్రత్యేకహోదా విషయంలో వాడిన జిమ్మిక్కులు అన్నీబాబుకి నిద్రలేకుండా చేస్తున్నాయి.

గతంలో ప్రజల్ని ఆకట్టుకోడానికి నానారకాల ప్రయత్నాలు చేసే బాబు, ఇప్పుడు సింపుల్ గా జగన్ ని ఫాలో అవుతున్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ క్రమక్రమంగా జగన్ లా మారిపోతున్నారు. ప్రత్యేకహోదా హామీని నెత్తికెత్తుకోవడం ఇందులో మొదటి పరిణామం. హోదా విషయంలో నాలుకను అడ్డదిడ్డంగా మడతపెట్టేసిన చంద్రబాబు చివరికి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నారు. హోదాపై జగన్ స్టాండ్ ని ఫాలో అయ్యారు.

ఇక రెండో పరిణామం నవరత్నాల కాపీ. జగన్ ప్రకటించిన నవరత్నాలను ఒక్కొకటే కాపీకొడుతూ వస్తున్నారు బాబు. పింఛన్ల పెంపుదల, డ్వాక్రా మహిళలకు నిధుల విడుదల, ఎన్టీఆర్ వైద్యసేవ పరిమితి పెంపు, ఆటో కార్మికుల ట్యాక్స్ రద్దు.. ఇలా ఒక్కొక్కటీ జగన్ కంటే ముందే అమలు చేస్తూ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. చివరిగా వేషధారణలో కూడా జగన్ ని ఫాలో అవుతున్నారు.

గతంలో నల్లచొక్కా ధరించి వైసీపీ ఎమ్మెల్యేలతో కలసి జగన్ అసెంబ్లీలో నిరసన చేస్తే.. ఇప్పుడు అదే నిరసనని చంద్రబాబు చేస్తున్నారు. పాదయాత్రలో జగన్ ఖాకీ చొక్కా తొడుక్కుని ఆటో కార్మికులతో కలసి నడిస్తే.. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఢిల్లీ దీక్ష కూడా జగన్ చూపిన మార్గమే.

గతంలో ఢిల్లీ గద్దె దద్దరిల్లేలో జగన్ ప్రత్యేకహోదా కోసం దీక్ష చేపట్టినప్పుడు ఎద్దేవా చేసిన చంద్రబాబు ఇప్పుడు తానే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను పక్కనపెట్టుకుని హస్తినలో దీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇలా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ జగన్ కు ఏకలవ్య శిష్యుడిలా మారిపోతున్నారు చంద్రబాబు. 

వైసీపీ వీటిని పట్టించుకోకపోవడం వారికే మేలు!

వినయ విధేయ, మజ్ను, పేటా కలిసి పోగొట్టుకున్నవే 70 కోట్లకు పైగా