Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబుగారింటికి వాస్తు దోషం?

బాబుగారింటికి వాస్తు దోషం?

చంద్రబాబు ఓ డిఫరెంట్ పర్సన్. ఆయనకు ఈ వాస్తులు, ముహూర్తాలు లాంటి నమ్మకాలు లేవు. కానీ 2014లో గెలవడానికి ముందు నుంచి గెలిచిన తరువాత ఈ నమ్మకాలు పెరిగాయని సన్నిహితులు అంటుంటారు. అలాగే మిగిలిన చాలా మందితో పోల్చుకుంటే ఆయన సామాజిక వర్గ అభిమానం, పిచ్చి అలాంటివి ఆయనకు తక్కువే. 

ఎన్టీఆర్ తో పోల్చుకున్నా, కొందరు మీడియా అధినేతలతో పోల్చుకున్నా చంద్రబాబుకు కులాభిమానం కూడా తక్కువే.  కానీ తమ అవసరం కోసం ఆయన చుట్టూ చేరారేమో కానీ, ఆయన చేరదీసింది తక్కువే. ఆయనకు ఎంత సేపూ అధికారం కావాలి. పేరు కావాలి. నలుగురు తన గురించే గొప్పగా చెప్పుకోవాలి. 

తన సామర్థ్యం నిరూపించుకోవాలి. ఇలాంటి తపన ఎక్కువ. కానీ 2014 తరవాత చంద్రబాబులో కాస్త మార్పు వచ్చింది. ముఖ్యంగా కొడుకు లోకేష్ కు వారసత్వ పగ్గాలు అప్పగించాలని అనుకోవడంతో, మిగిలిన నాయకుల వారసులను కూడా అనుమతించాల్సి వచ్చింది.

హైదరాబాద్ ఇంటిని తిరిగి నిర్మించినపుడు బావమరిది బాలయ్య ఈయనకు కూడా కాస్త వాస్తు నమ్మకం అంటించారు. దాంతో అమరావతి కూడా వాస్తు చూపించడం, ఆ మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించడం వంటివి చేసారు. 

కానీ లేటెస్ట్ గా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు ఏమిటంటే, హైదరాబాద్ లోని బాబుగారింటికి వాస్తు సరిగ్గా లేదని, ఆ ఇల్లు తిరిగి నిర్మించిన దగ్గర నుంచే బాబుగారికి రాజకీయంగా సమస్యలు ఎదురవుతున్నాయని, అంతకు ముందు నేలమట్టం చేసిన ఇంటిలో వున్నన్నాళ్లు బాగానే వుండేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఆ ఇంట్లో వుండగా వైఎస్ ను రెండు సార్లు ఢీకొని ఓడిపోయినా కూడా నిలదొక్కుకోగలిగారని, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆయన వ్యవహారం ఓ డెడ్ ఎండ్ కు చేరుకున్నట్లు అగమ్య గోచరంగా వుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే బాలయ్య అంతా తానే దగ్గరుండి ఆ ఇంటికి వాస్తు అవీ చూపించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.అంటే పెర్ ఫెక్ట్ గానే వుండి వుండాలి. లేదా ఎక్కడో తెలియని, కనిపించని తేడా వుండి వుండాలి.

ఇప్పుడు అది తెలుసుకుని సరిచేస్తే మంచిది అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ బాబుగారికి ఈ కామెంట్లు చేరితే పని జరగదు. బాలయ్య బాబుకు చేరితేనే ఆ దిశగా వ్యవహారాలు వుంటాయి.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?