cloudfront

Advertisement


Home > Politics - Gossip

పొత్తుకు దూరంగా బాబు పరార్ అయినట్టే!

పొత్తుకు దూరంగా బాబు పరార్ అయినట్టే!

ఎన్నిమాటలు చెప్పాడు.. ఎన్ని కథలు వివరించాడు... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పడాల్సిన ఆవశ్యకత గురించి కనీసం కాంగ్రెస్ వాళ్లు చెప్పలేని స్థాయిలో చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఢిల్లీ వరకూ వెళ్లి బాబు ఈ మాటలన్నీ చెప్పాడు. ఔరా.. అనుకుంది జాతీయ మీడియా కూడా! కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమిని ఏర్పాటు చేస్తామని.. ఆ కూటమిలోకి అన్ని పార్టీలనూ తనే తీసుకొస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు అప్పుడు ఢిల్లీ వరకూ వెళ్లి చెప్పుకున్నాడు.

అయితే ఇప్పుడు బాబు తీసుకున్న మరో యూటర్న్ తో జాతీయ మీడియా కూడా ఆశ్చర్యపోతోంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని చంద్రబాబునాయుడు పార్టీ అంటోందని జాతీయ మీడియా వర్గాలు బోలెడన్ని ఆశ్చర్యార్థకాలతో వార్తలు రాస్తున్నాయి.

అఖిలేష్ యాదవ్, మాయవతి పార్టీల తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని చెబుతున్న పార్టీగా తెలుగుదేశం నిలుస్తోందని జాతీయ మీడియా వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో తాము తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదించగా.. కాంగ్రెస్ తో లోక్ సభ ఎన్నికల్లో పొత్తు ఉండదని వారు స్పష్టతను ఇచ్చారని నేషనల్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రత్యేకించి ఏపీలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందని వారు వ్యాఖ్యానించారని.. అందుకే కాంగ్రెస్ తో లోక్ సభ ఎన్నికల్లో పొత్తు ఉండదని వారు పేర్కొన్నట్టుగా కథనాలను ఇస్తున్నాయి సదరు మీడియా సంస్థలు. ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చంద్రబాబుకు పొత్తు వర్కవుట్ అయి ఉంటే.. ఏపీలో కాంగ్రెస్ కు ఖాయంగా ప్రాధాన్యతను ఇచ్చేవారడనంలో ఆశ్చర్యం ఏమీలేదు.

అయితే తమ పొత్తును అక్కడి జనాలు తిరస్కరించడంతో.. ఆ ప్రభావం ఏపీపై గట్టిగా పడుతుందని గ్రహించి బాబు కాంగ్రెస్ కు దూరం అవుతున్నాడని ఆ కథనాల్లో విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి అని హడావుడి చేసిన బాబు ఇలా యూటర్న్ తీసుకోవడం మాత్రం విశేషమే అని ఆ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా బాబుకు యూటర్న్ లు కొత్తా ఏమిటి?

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!