Advertisement


Home > Politics - Gossip
బాబు ప్రభుత్వంలో రైతుకు భరోసా!

చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రైతులకు భరోసా లభించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కెఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో మంత్రి కెఈ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్ధికంగా అనేక కష్టాల్లో ఉన్నప్పటికీ, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి పంతో కష్టపడుతున్నారని పేర్కొన్నారు.

నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రెవెన్యూ సేవలను విస్తరిస్తున్నట్టు చెప్పారు. తహశీల్దారు వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్టు పేర్కొన్నారు. భూ రిజిస్ట్రేషన్స్‌లో మోసాలకు అడ్డుట్ట వేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తహశీల్దారు కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నట్టు ఉపముఖ్యమంత్రి కెఈ చెప్పారు.

రాష్ట్రంలో 98శాతం రెవెన్యూ రికార్డులను పటువంటి దిద్దుబాటులకు తావులేకుండా సరిచేసి, కంప్యూటరైజ్‌ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలియజేశారు. గతంలో భూరికార్డుల్లో కొన్ని తప్పులు దొర్లేవని, సమాచార సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందడంతో రైతుల భూ రికార్డుల పూర్తి వివరాలను సేకరించి, ఆన్‌లైన్‌లో పొందుపరిచినట్టు చెప్పారు.

జమాబందీ రెవెన్యూ రికార్డుల పరిశీలన ప్రక్రియను సంవత్సరానికి ఒకసారే చేసేవారమని, అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్‌ సేవల ద్వారా ఈ ప్రక్రియను ఎప్పటికపుడు నిర్వహించేందుకు మార్గం సుగమం అయిందన్నారు. జమాబందీ, సర్వే నంబర్‌ టాంపరింగ్‌, భూమి రికార్డుల సమస్యలను అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితంగా సరి చేయగలుగుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.