cloudfront

Advertisement


Home > Politics - Gossip

తన విష ప్రచారానికి తానే బలికాబోతున్న బాబు

తన విష ప్రచారానికి తానే బలికాబోతున్న బాబు

ఆత్మస్తుతి, పరనింద.. ఎన్నికల్లో ప్రతి అభ్యర్థీ, ప్రతి రాజకీయ పార్టీ చేసే పనే ఇది. కానీ చంద్రబాబు ఈసారి ఆత్మస్తుతిని పూర్తిగా పక్కనపెట్టేశారు. తన ప్రభుత్వం ఏమేం చేసిందీ చెప్పుకునే అవకాశం చంద్రబాబుకి లేదు. కనీసం మేనిఫెస్టోలో హామీల గురించి కూడా మాట్లాడే ధైర్యం అసలే లేదు. ఆ మాటకొస్తే ఈసారి మేనిఫెస్టో పేరెత్తితే చంద్రబాబుని ప్రజలు మొహం మీదే ఛీకొట్టే పరిస్థితి. అందుకే ఆత్మస్తుతిని వదిలేసి పరనిందపైనే పడిపోయారు బాబు.

అధికారంలో లేకపోయినా ఐదేళ్లపాటు ప్రజాపోరాటాలు చేస్తున్న జగన్ పై ఎన్నికల వేళ కొత్తనిందలు వేయడం మొదలుపెట్టారు. మోడీ బీటీమ్ అని, కేసీఆర్ తో లాలూచీ పడి, తెలంగాణ నుంచి వచ్చిన నిధులతో ఇక్కడ రాజకీయం చేస్తున్నారని పూర్తిగా బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. అయితే ఈ బ్లేమ్ గేమ్ బాబుకి సెల్ఫ్ గోల్ అవుతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఆడుతున్న ఈ ఆట వారికే కష్టాల్ని తెచ్చిపెట్టబోతోంది.

కేసీఆర్ పేరుతో చేస్తున్న ప్రచారమంతా టీడీపీకి వ్యతిరేకంగా మారుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనపడుతోంది. కేసీఆర్, జగన్ ఒకటే అంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఎక్కడా ప్రజల నుంచి స్పందన రావడంలేదు, కనీసం ప్రజల్లో ఆ పాయింట్ పై చర్చ కూడా జరగడంలేదు. అసలు బాబు ఎందుకిలా మాట్లాడుతున్నారు, చంద్రబాబుకి ఏమైంది అనే ప్రశ్నలు మాత్రం వస్తున్నాయి.

జగన్ ని ఎదుర్కోలేకే చంద్రబాబు కేసీఆర్ పేరు చెప్పుకుని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని జనాలకు అర్థమైపోయింది. పోలవరాన్ని అడ్డుకుంటారు, మచిలీపట్నం పోర్ట్ ని తీసుకెళ్తారు అంటూ చినబాబు చేస్తున్న ప్రచారం కూడా పూర్తిగా రివర్స్ అయింది. అసలు మాట్లాడ్డమే చేతకాని లోకేష్ ఆరోపణలు చేస్తే ఇలానే ఉంటుందని నవ్వుకుంటున్నారు ప్రజలు.

రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ పై ఆంధ్ర ప్రాంతంలో వ్యతిరేకత ఉండి ఉండొచ్చు కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. హైదరాబాద్ లో ఏపీ ప్రజలు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో పనులు చేసుకుంటున్నారనే విషయం ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటప్పుడు చంద్రబాబు బూటకపు ప్రచారాన్ని వారెలా నమ్ముతారు? అసలు ప్రజలు నమ్మి తమకు ఓట్లు వేస్తారని బాబు ఎలా ఊహించారు? కేసీఆర్ పేరు చెప్పి చేస్తున్న విషప్రచారం టీడీపీకి ఏమాత్రం ఉపయోగపడకపోగా ప్రతిపక్షానికి మేలుచేసేలా ఉంది.

సీట్ల కేటాయింపులో జగన్‌ నేర్పరితనం!