cloudfront

Advertisement


Home > Politics - Gossip

కాంగ్రెస్ ని పూర్తిగా వాడేస్తున్న చంద్రబాబు

కాంగ్రెస్ ని పూర్తిగా వాడేస్తున్న చంద్రబాబు

రాష్ట్ర రాజకీయాల కోసం ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కేంద్రంలో హస్తానికి మద్దతు తెలుపుతాం. ఢిల్లీ వేదికగా చంద్రబాబు రాజకీయ దివాళాకోరుతనాన్ని ఈ మాటలు బైటపెట్టాయి. ఐకమత్యమే మహాబలం అంటారు, కానీ చంద్రబాబు తన శత్రువులే తనకు బలం అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం ఓ రేంజ్ లో వాడుకుంటున్నారు.

అవసరమైన చోట ఫేస్ వేల్యూ ఉన్న కాంగ్రెస్ లీడర్లని టీడీపీలో కలిపేసుకుంటున్నారు. ఇలాచూస్తే ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేస్తున్నట్టే లెక్క. తాజాగా తిరుపతి ఎంపీ స్థానానికి మాజీమంత్రి పనబాక పేరు పరిశీలిస్తున్నారు. వైసీపీలో ఖాళీ లేకపోవడంతో చివరకు టీడీపీలో చేరుతున్నారు పనబాక. అయితే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పనబాక లక్ష్మి భర్త కృష్ణయ్య మాత్రం ఆపార్టీలోనే ఉంటారు.

కృష్ణయ్య సూళ్లూరుపేట టికెట్ కావాలని కోరినా చంద్రబాబు నో చెప్పడంతో ఆయన కాంగ్రెస్ తరపునే పోటీ చేయబోతున్నారు. ఇదేమి చోద్యం అనుకునేవారికి కాంగ్రెస్, టీడీపీ లోపాయికారీ ఒప్పందమే సమాధానం. రాష్ట్ర రాజకీయాల కోసం భర్త కాంగ్రెస్ లో ఉంటారు, దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భార్య టీడీపీ తరపున పోటీ చేస్తుంది. ఇదీ ఇక్కడ లాజిక్.

విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ మాజీ ఎంపీ కిశోర్ చంద్రదేవ్, కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, అమలాపురంలో హర్షకుమార్, రాజంపేటలో సాయప్రతాప్.. ఇలా టీడీపీ ఎంపీల లిస్ట్ లో ఉన్నవారిలో ఎక్కుమంది కాంగ్రెస్ మాజీలే ఉన్నారు. విభజన పాపానికి ఏపీలో కాంగ్రెస్ కి పుట్టగతులు లేవని తేలిపోవడంతో అధినాయకత్వం కూడా నాయకులను వారి వారి ఇష్టాలకు వదిలేసింది.

తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని పెద్ద తప్పుచేసిన కాంగ్రెస్, ఏపీలో పార్టీని తానే చంపుకుంటోంది. పేరున్న నాయకులను టీడీపీలోకి పంపించి, మిగతాచోట్ల డమ్మీ అభ్యర్థులతో ఆ పార్టీకి మేలు చేసేలా ప్రవర్తిస్తోంది. ఇలా పెట్టిన డమ్మీ అభ్యర్థుల ఖర్చునంతా తానే భరిస్తానంటూ చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు.

ఆమేరకు ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పూర్తిగా లాభపడ్డారట. 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

బాబుది ఎదురుదాడే.. నిజాన్ని ఎదుర్కొనలేరు!