cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబు మరీ ఇంత భయపడుతున్నాడా?

బాబు మరీ ఇంత భయపడుతున్నాడా?

‘ఈవీఎంలను మేనేజ్ చేస్తారేమో..’ అని అన్నాడట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. తమ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఓడితే ఈవీఎంల మీద నెపం నెట్టేయడం ఒక పద్ధతి.

అయితే ఎన్నికల ముందే ఇలా ఈవీఎంలను మేనేజ్ చేస్తారేమో.. అని చంద్రబాబు నాయడు అన్నారంటే.. ఇలా కొత్త కొత్త భయాలు బాబు మదిలో మెదులుతున్నాయంటే ఎన్నికలు ఊహే బాబును భయపెడుతోందని అనుకోవచ్చు. కొత్త కొత్త విషయాలను ఊహించుకుని చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడని అనుకోవాల్సి వస్తోంది.

లేకపోతే తమ ఓటమికి రీజన్లను ముందే ప్రజలకు చెబుతున్నాడనుకోవచ్చు. లేదా అప్పుడే చేతులెత్తేస్తున్నారని భావించాల్సి వస్తుంది. మొన్నటి వరకూ చంద్రబాబుకు ఇలాంటి ఆందోళన లేదు. వివిధ రాష్ట్రాల్లో ఓడిన కాంగ్రెస్ పార్టీ వాళ్లు, వేరే వాళ్లు ఈవీఎంల వల్ల ఓడిపోయాం, బీజేపీ ఈవీఎంలను మేనేజ్ చేసింది అని ఆరోపించారు. అయితే అప్పుడు చంద్రబాబు నోరు విప్పలేదు.

ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకం అయ్యే సరికి ఈవీఎంల మేనేజ్ మెంట్ గుర్తుకు వస్తోంది చంద్రబాబుకు. ఒకవేళ బీజేపీ ఈవీఎంలను మేనేజ్ చేస్తూ ఉండి ఉంటే.. నంద్యాల్లో కూడా అదే జరిగిందా? అప్పుడు తెలుగుదేశం, బీజేపీలు దోస్తులుగానే ఉన్నాయి. కాబట్టి బాబుకు అలాంటి సహకారం ఏమైనా అందిందా? అనే సందేహాలు కూడా జనిస్తున్నాయి. చంద్రబాబుకు వయసుతో వస్తున్న చాదస్తమో లేక ఎన్నికలంటే భయమో కానీ.. చాలానే భయపడుతున్నట్టుగా ఉన్నాడు.