Advertisement

Advertisement


Home > Politics - Gossip

బావగారికి బాలయ్య వెన్నుపోటు ఖరారు?

బావగారికి బాలయ్య వెన్నుపోటు ఖరారు?

అప్పలకొండ: ప్లస్ కి మైనస్ కి క్రాసింగ్ జరిగితే మైనస్సా, ప్లస్సా అన్నాయ్?

జోగినాథం: మరీ "క్రాసింగ్" ఏంట్రా అసహ్యంగా. "ఇంటూ" అనో "గుణిస్తే" అనో అనాలి. 

అప్పలకొండ: అదేలే. ఇంతకీ ఆన్సరేంటి. 

జోగినాథం: ఏమోరా. ఎప్పుడో చిన్నప్పుడు మాస్టారు తోడపాశం పెట్టి చెప్పాడు. గుర్తులేదు. ఇప్పుడెందుకది?

అప్పలకొండ: ఎందుకంటావేంటి? జూనియర్ ఎన్.టి.ఆర్ తెలుగుదేశంలోకి రావడానికి, దీనికి చాలా పెద్ద లింకుంది. బాలయ్య బాబు కోడ్ లాంగ్వేజులో ఏదో చెప్పాడు. దాన్ని డీకోడ్ చెయ్యాలిప్పుడు నేను. 

జోగినాథం: ఓసినీ..అదా? కోడ్ భాషా పాడా..అడిగినదానికి ఏం చెప్పాలో తెలీక అలా చెప్పాడు. అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు. నువ్వు కూడా బాలయ్యలా అయిపోతావ్. 

అప్పలకొండ: అదేంటన్నయ్య అలా అనేసావ్. బాలయ్యలాగ అయిపోవడమంటే ..ఏంటి నీ ఉద్దేశ్యం?

జోగినాథం: పిచ్చోడివైపోతావ్ అని. 

అప్పలకొండ: అన్నా..నేను ఆయన ఫ్యాన్ ని...అన్నయ్యవని కూడా చూడను మా బాలయ్యని అలా అన్నావంటే. 

జోగినాథం: నేను కాదు రా బాబు అనేది. ఆసుపత్రి వాళ్లు ఎప్పుడో ఇచ్చిన సర్టిఫికేట్ ఈమధ్య ఎవడో నాకు వాట్సాపులో పంపాడు. అది చూసి అనుకుంటున్నాను. ఎందుకులే..ఆ మ్యాటర్ వదిలెయ్. 

అప్పలకొండ: నేను వదలను. అసలు బాలయ్యంటే ఏమనుకుంటున్నావన్నా? నవగ్రహాలు కూడా ఆయన అదుపులో ఉంటాయి. ఆయన చేతికి పెట్టిన ఉంగరాలు చూసావా? జగదేకవీరుడు అతిలోక సుందరిలో ఒక్క ఉంగరాన్ని నమ్ముకున్నందుకే చిరంజీవి దేవకన్యకి మొగుడయ్యాడు. మా బాలయ్య ఒక్క వేలుని కూడా వదలకుండా పెట్టాడు చూడు ఉంగరాలు. ఈ రాష్ట్రానికే మొగుడౌతాడన్నా. 

జోగినాథం: అఖండ సినిమా హిట్ అవడం కోసం బొటనవేలుకి కూడా పెట్టేసేడంటగా ఉంగరం?!

అప్పలకొండ: మా బాలయ్యకి ఒక్కో ఉంగారానికి ఒక్కో అర్థం ఉంటది. సినిమాకొకటి, రాజకీయానికి ఒకటి, మీడియా ముందు మాట్లాడడానికి ఒకటి, హాస్పిటల్ వ్యాపారానికొకటి, సీ.ఎం అవడానికొకటి, పాటలు పాడడానికొకటి...

జోగినాథం: ఆ చివరి ఉంగరం ఏ వేలికి పెట్టాడ్రా?

అప్పలకొండ: ఏం?

జోగినాథం: ఏం లేదు..షేకేండ్ ఇచ్చి లాగెద్దామని. 

అప్పలకొండ: ఏంటన్నా ఆయన పాట నచ్చట్లేదా నీకు?

జోగినాథం: నువ్వు ఫ్యానువి. చెప్పి బాధపెట్టలేను. 

అప్పలకొండ: అర్థమయిందిలే. ఎవడి ఒపినీయన్ వాడిది. మా బాలయ్య బాబు కూడా ఇలాగే చెప్పాడు జూనియర్ ఎన్.టి.ఆర్ టి.డి.పి కి నాయకత్వం వహించాలని చాలామంది అనుకుంటున్నారని అడిగితే...

జోగినాథం: కానీ తన ఒపీనియన్ కూడా చెప్పాడు కదా...జూనియర్ పెద్ద మైనస్ అవుతాడని. 

అప్పలకొండ: అవునన్నా..బాలయ్య చెప్పాడు కదా..రామారావుగారి పేరు పెట్టుకుని సినిమాల్లో చేస్తున్నంత మాత్రాన లీడర్లయిపోరని. 

జోగినాథం: అంతే కాదు. తనే టి.డి.పి కి కరెక్ట్ లీడర్ని అని కూడా చెప్పాడు. బావగారికి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు. 

అప్పలకొండ: బాలయ్య ఏ పోటు పొదిచినా కరెక్టే అన్నా. ఎందుకంటే ఆయాన మా బాలయ్య. బాబుగార్ని వెన్నుపోటు ఎందుకు..ఎదురుపోటే పొడిచేత్తాడు. అయినా చెప్పేసేక ఇక వెన్నుపోటేంటి? మా బాలయ్య ఏం చేసినా ఓపెనే!

జోగినాథం: నీ బాలయ్య భక్తి తగలెయ్య. మొన్నటిదాకా చంద్రబాబుని ఏవన్నా అంటే బూతులు తిట్టేవాడివి కదరా..

అప్పలకొండ: అవునన్నా. నా మూడ్ బాలయ్యని బట్టి ఉంటుంది. చంద్రబాబు తర్వాత తానే బెటర్ లీడర్ని అని హింట్ ఇస్తున్నాడు. అందుకే చంద్రబాబుని నేను పట్టించుకోను. ఒకవేళ తన అల్లుడు సీన్లోకి వస్తే మాత్రం తప్పుకుంటానంటున్నాడు. 

జోగినాథం: అలా అనక తప్పుతుందా? ఈ ఒక్క మ్యాటర్లో మాత్రం బాలయ్య బుర్రని బాగానే వాడాడు. 

అప్పలకొండ: ఎలా?

జోగినాథం: అంతా తానే అంటే లోకేష్ ని పప్పు అని ఒప్పేసుకున్నట్టవుతుంది. అదే జరిగితే బాబుగారు ఫీల్ అవుతారు. బ్రాహ్మణి గారు కూడా. కూతురి కాపురాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యత గల తండ్రిగా మాట్లాడాడు తనకొచ్చిన భాషలో. 

అప్పలకొండ: అందుకే అన్నా..బాలయ్య అంటే నాకు ప్రాణం...ఆయనకి బాధ్యత ఎక్కువ.

జోగినాథం: అవును చాలా ఎక్కువ. అదే బాధ్యత టి.డి.పి కి నాయకత్వం వహించే ఆలోచన పెట్టుకోకుండా ఉండడంలో కూడా ఉండాలి. నువ్వూ, నీ బాలయ్య సల్లగుండాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?