cloudfront

Advertisement


Home > Politics - Gossip

బావకు బాలయ్య సమస్యలు

బావకు బాలయ్య సమస్యలు

ఎంతవారికైనా ఇంటి సమస్యలు తప్పవు. అది చంద్రబాబు అయినా తప్పదు. ఇప్పుడు బాబుకు ఈ తరహా సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చిన్న అల్లుడు శ్రీభరత్ కు టికెట్ ఇచ్చి తీరాల్సిందే అన్నది బాలకృష్ణ కోరికగా తెలుస్తోంది. ఓ అయిదేళ్లు పార్టీలో పనిచేసి, ప్రజల్లో తిరిగితే బెటర్ అన్నది బాబు సూచనగా వినిపిస్తోంది.

దీనికి శ్రీభరత్ ఒప్పుకోవడం లేదని టాక్. దగ్గుబాటి కొడుకు, చంద్రబాబు కొడుకు పోటీచేస్తుండగా, రాజకీయ వారసత్వం, డబ్బు వున్న తనకేం తక్కువ అన్నది శ్రీభరత్ వాదనగా తెలుస్తోంది. బాలయ్య కూడా ఎలాగైనా శ్రీభరత్ ను ఎక్కడో ఒకదగ్గర టికెట్ ఇచ్చి పోటీకిదింపాలని బావను కోరుతున్నారట.

ఇదిలావుంటే మరో సీటు విషయంలో కూడా బాలయ్య పట్టుపడుతున్నట్లు 'దేశం' వర్గాల బోగట్టా. ప్రకాశంజిల్లాలో కదిరి బాబూరావుకు టికెట్ విషయంలో కూడా బాలయ్య గట్టిగా పట్టుపట్టి కూర్చున్నట్లు తెలుస్తోంది. బాలయ్య మాట వినకపోతే వ్యవహారం ఎటు వెళ్లి ఎటు తిరుగుతుందో అని బాబుగారు కిందామీదా అవుతున్నట్లు దేశంవర్గాల బోగట్టా.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

బాబుది ఎదురుదాడే.. నిజాన్ని ఎదుర్కొనలేరు!