cloudfront

Advertisement


Home > Politics - Gossip

బీసీ రిజర్వేషన్ల మెడపై కత్తి

బీసీ రిజర్వేషన్ల మెడపై కత్తి

అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికి ఆర్థికంగా పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ వర్తింపజేసే ఈ ట్రంప్ కార్డ్ వంటి నిర్ణయం ద్వారా.. అసలే తన వెలుగులు మసకబారిపోతున్న ఈ తరుణంలో మోడీ.. మళ్లీ అధికారం చేజిక్కించుకోవడానికి.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. ఆయన బీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా.. ఓసీల కోసం ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడంటూ... భజన చేయడానికి కూడా చాలామంది అత్యుత్సాహం కనబరుస్తున్నారు.

అదే సమయంలో ఇలాంటి నిర్ణయం తగదని బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో... ఇవాళ ఓసీల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పిచండం ద్వారా నీరాజనాలు అందుకుంటున్న మోడీ.. ముందు ముందు.. బీసీల్లో సంపన్నులకు కూడా రిజర్వేషన్లు కోత పెట్టే ప్రయత్నం చేస్తారనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

బీసీల్లో క్రీమీలేయర్ గురించిన చర్చ ఎప్పటినుంచో ఉంది. ఎన్ని దశాబ్దాలుగా రిజర్వేషన్లు ఉన్నప్పటికీ.. వాటిని పొందినవారే మళ్లీ మళ్లీ పొందుతున్నారు తప్ప.. వాటికి దూరంగా ఉన్న, నిజంగా వెనుకబడిన వర్గాలు ఎప్పటికీ వెనుకబడే ఉంటున్నాయనే వాదన చాలా కాలంగా ఉంది.

దీనికి విరుగుడుగా రిజర్వేషన్ల ఫలాలు ఆయా వర్గాల్లో అందరికీ సమానంగా అందాలంటే.. క్రీమీలేయర్ విధానం ఒక్కటే మార్గమని కొందరు అంటుంటారు. భాజపా ప్రభుత్వం కూడా దీనికి అనుకూలమే అనే ప్రచారం కొంత జరిగింది.

తాజాగా ఇప్పుడు ఓసీల్లో పేదలను ప్రత్యేకంగా గుర్తించే ప్రయత్నం జరిగినప్పుడు, కొందరిలో బీసీల్లో సంపన్నులను గుర్తించే ప్రయత్నం కూడా జరగగలదనే భయం మొదలవుతోంది. చాలామంది అనుకుంటున్నట్లగా ఓసీల్లో పేదలకు రిజర్వేషన్లు అనేది ఎన్నికల్లో భాజపాకు బాగా లాభించే అంశమే.

ఇది లోక్ సభ ఆమోదం పొందిన పొందకపోయినా.. చట్టరూపం సంతరించుకున్నా.. సంతరించుకోకపోయినా.. వారికి ఫరక్ లేదు. మేం చేయదలచుకున్నాం.. ప్రతిపక్షాలు అడ్డంపడ్డాయి.. అనే దబాయింపు ధోరణితో వారు ఎన్నికల్లో చెలామణీ అయిపోగలరు. అసలే భాజపాకు అగ్రవర్ణాల పార్టీ అనే పేరుంది. దీంతో వారు మరింతగా జనాభిమానం కూడగట్టుకుంటారు.

బీసీ రిజర్వేషన్లలో కోతపెట్టే తంతు ఇప్పుడు మొదలు కాకపోవచ్చు. కానీ.. ఈ తాజా నిర్ణయం ద్వారా మోడీ మళ్లీ గద్దెమీదకు వస్తే.. తొలి రెండేళ్లలో ఆ నిర్ణయం వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది.

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

కేసీఆర్ ఫ్రంట్ ఇక అంతేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్