భాజపాలో మళ్లీ ‘కమ్మ’ ఆధిపత్యం

ఆంధ్ర ప్రదేశ్ లో 80వ దశకానికి ముందు, తరువాత అన్నట్లుగా వుంటుంది భారతీయ జనతా పార్టీ వ్యవహారం. అంతకు ముందు ఎలా వున్నా, ఆ తరువాత భాజపాను కమ్మ సామాజిక వర్గం ప్రభావితం చేస్తూ…

ఆంధ్ర ప్రదేశ్ లో 80వ దశకానికి ముందు, తరువాత అన్నట్లుగా వుంటుంది భారతీయ జనతా పార్టీ వ్యవహారం. అంతకు ముందు ఎలా వున్నా, ఆ తరువాత భాజపాను కమ్మ సామాజిక వర్గం ప్రభావితం చేస్తూ వచ్చింది. తెలంగాణలో మాత్రం రెడ్డి సామాజిక వర్గం వుండేది. ఇలాంటి టైమ్ లో టోటల్ గా పార్టీలో కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యం సహించలేక, చినికి చినికి గాలివానగా మారి, ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అన్న నినాదానికి తొలిసారిగా తెరతీసింది భారతీయ జనతా పార్టీనే. ఆ పార్టీ కాకినాడ సభల్లో ఈ మేరకు తీర్మానం చేసారు. చిత్రమేమిటంటే విభజన పాపాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసి, ఆ పార్టీని జనం ఖతమ్ చేసేలా చేసింది, ఈ కమ్మ వర్గానికి అండగా వుండే మీడియానే. 

ఇలాంటి టైమ్ లో ఆంధ్రలో వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి చేసిన తరువాత సీన్ మొత్తం మారిందన్న విశ్లేషణలు కనిపించాయి. వినిపించాయి. కంభంపాటి హరిబాబు కూడా సైలంట్ అయిపోయారు. కాపు సామాజిక వర్గం చేతిలోకి పగ్గాలు వచ్చాయి. జనసేన నేత పవన్ కళ్యాణ్ నేరుగా భాజపాతో చేతులు కలిపారు. దీంతో భాజపాలో సామాజిక కోణాలు సమూలంగా మారిపోతున్నాయి అన్న అభిప్రాయం సర్వత్రా కలిగింది.

కానీ ఇప్పడు మళ్లీ ఉన్నట్లుండి సీన్ రివర్స్ అయిపోతోంది. కంభంపాటి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. దేశం నుంచి వెళ్లిన సుజన చౌదరి అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం తరపున భాజపాలోకి వెళ్లి అక్కడ టికెట్ తెచ్చుకుని, ఆ కోటాలో మంత్రిగా వున్న కామినేని శ్రీనివాస్ కూడా కీలకంగా వున్నారు.

ఆ విధంగా మళ్లీ కమ్మ సామాజిక వర్గ నాయకులు ఆంధ్ర భాజపాను తమ అదుపులోకి తీసేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. భాజపాలోని ఈ వర్గానికి అనుకూలంగా వుండే కిషన్ రెడ్డి లాంటి కీలకనేతల మద్దతు కూడా ఈ వర్గానికి లభిస్తోందని బోగట్టా. 

పునరాలోచనలో పవన్

ఇలాంటి నేపథ్యంలో భాజపాలోని కాపు వర్గం పునరాలోచనలో పడుతోంది. పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి, ఇన్నో అన్నో సీట్లు తెచ్చుకున్నా, మళ్లీ భాజపాలోని ఆ వర్గమే చక్రం తిప్పుతుందనే పిక్చర్ ఇప్పుడే క్లియర్ గా కనిపిస్తోందన్న భావన ఈ వర్గంలో కలుగుతున్నట్లు బోగట్టా.  అయితే ప్రస్తుతం కరోనా, చైనా వంటి కీలక వ్యవహారాల్లో తలమునకలుగా వున్నా కేంద్ర భాజపా ఈ చిక్కుముడుల కేసి దృష్టి పెట్టడం లేదు. పైగా ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. దీన్నే చాన్స్ గా తీసుకుని, భాజపాలోని కమ్మ సామాజిక వర్గం తన పూర్వ ఆధిపత్యాన్ని మళ్లీ సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

ముఠా నాయకుడు బైటకు రావాలి