Advertisement

Advertisement


Home > Politics - Gossip

భాజపాలోకి వలసలు అప్పుడే కాదు

భాజపాలోకి వలసలు అప్పుడే కాదు

తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కాగానే, వైకాపా అధికార పీఠం అధిష్టించగానే అర్జెంట్ గా వలసల దారిపట్టింది కార్యకర్తలో, దిగువ స్థాయి నాయకులో కాదు. అప్పటి వరకు తెలుగుదేశం అండతో పదవులు అనుభవించి, అంతో ఇంతో సంపాదించుకున్నారని పేరుపడిన వారే. అర్జెంట్ గా తెలుగుదేశానికి బై చెప్పి, భాజపా తలుపు తట్టారు సుజనా చౌదరి, రమేష్ లాంటి పెద్ద వాళ్లు.

అందుకే జనాలు వాళ్ల వలసను సీరియస్ గా తీసుకోకుండా ఇదంతా బాబు గారి వ్యూహం. కోవర్ట్ వ్యవహారం అనేసారు. సరే ఆ తరువాత కూడా ఒకటి రెండు వలసలు జరిగాయి కానీ, మరీ మూకుమ్మడిగా జరగలేదు.

ఇలాంటి నేపథ్యంలో భాజపాకు కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ మాదిరిగా వైకాపాను టార్గెట్ చేస్తూ కూర్చోకుండా, చకచకా పార్టీని బలోపేత చేసే కార్యక్రమాలు తీసుకున్నారు. కార్యవర్గాన్ని చకచకా అందించారు. అంతే కాదు, ఇదే నేపథ్యంలో వలసలు కూడా గట్టగానే వుంటాయనే వార్తలు వచ్చాయి. వైకాపాలోకి వెళ్తారనుకున్న గంటా శ్రీనివాసరావు లాంటి వారు భాజపా దారి పడతారని వార్తలు వినిపించాయి.

కానీ, రాజకీయ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్నదేమిటంటే, భాజపాలోకి అర్జెంట్ గా వలస పక్షులను రప్పించాలని సోము వీర్రాజు అనుకోవడం లేదట. ఆయన స్టయిల్ ఆఫ్ ఫంక్షన్ వేరుగా వుందని తెలుస్తోంది. ముందుగా అసలు పార్టీని నమ్ముకుని వున్నది ఎవరు? ఏయే జిల్లాల్లో ఎక్కడెక్కడ పార్టీ ఉనికి చెప్పుకోదగ్గదిగా వుంది. ఎక్కడ లేదు? ఎక్కడ నాయకులు అవసరం? ఎక్కడ అక్కరలేదు? ఇలాంటివి అన్నీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 

పైగా తెలుగుదేశం వలసపక్షుల విషయంలో సోము వీర్రాజు ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు బోగట్టా. కొత్త కార్యవర్గంలో ఈ వలస పక్షులను దాదాపు పక్కన పెట్టారు. కులాల సమతూకం కూడా చూసుకున్నారు. ఆరెస్సెస్ భావజాలం కూడా కీలకంగా తీసుకున్నారు. ఎప్పుడయితే తెలుగుదేశం వలస ఫక్షుల విషయంలో సోము వీర్రాజు అప్రమత్తగా వున్నారన్న టాక్ బయటకు వచ్చిందో, జంప్ చేద్దాం అనుకునేవారు ఆలోచనలో పడ్డట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం వున్నవారితో పార్టీని కార్యోన్ముఖంగా నడిపించడం, ఆ పైన పార్టీకి ఎవరు, ఎక్కడ అవసరం అనేదానిపై దృష్టి పెట్టి, అక్కడ వలసలను స్వాగతించడం అనే ద్విముఖ వ్యూహాన్ని సోము వీర్రాజు అనుసరిస్తున్నారని తెలుస్తోంది. పైగా ఎన్నికలు ఇంకా చాలా దూరం వున్నాయి. ఇప్పటి నుంచి వలసపక్షులను ప్రోత్సహించి, పార్టీలోకి తీసుకువచ్చి, లేనిపోని తలకాయనొప్పులు తెచ్చుకోవడం అవసరమా? అనే ఆలోచనలో కూడా వీర్రాజు వున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 

అందువల్ల వినిపిస్తున్న ఈ కబుర్లు అన్నీ నిజమే అయితే, భాజపాలోకి వలసపోయి తమ వ్యాపారాలు, ఆదాయాలు, అక్రమాలు అన్నీ కాపాడుకుందాం అనుకునే చాలా మంది నాయకుల ఆశలకు బ్రేక్ పడినట్లే.

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?