Advertisement

Advertisement


Home > Politics - Gossip

భాజపా ఓటు లాగేయడానికేనా?

భాజపా ఓటు లాగేయడానికేనా?

ఎవ్వరూ ఊహించని ఎత్తుగడలు వేయడంలో దిట్ట తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ముఖ్యమంత్రి పివి నరసింహారావు కుమార్తె వాణి దేవి ని ఎంపిక చేయడం ఇలాంటి ఎత్తుగడే. 

అటు భాజపా, ఇటు కాంగ్రెస్ ను కార్నర్ లోకి తోయడానికి వేసిన ఎత్తుగడగా చూడాలి దీనిని. కాంగ్రెస్ పార్టీ పిఎమ్ గా పని చేసిన నాయకుడి కుమార్తె. అందువల్ల కచ్చితంగా ఆ పార్టీ కాస్త ఇరుకునపడుతుంది.

ఇక భాజపా సంగతి కూడా అలాగే వుంటుంది. భాజపా అంటే ఇష్టపడే సామాజిక వర్గానికి చెందిన వాణి కి సహజంగా ఆ వర్గం నుంచి ఆదరణ వుంటుంది. అలాగే పివి అంటే వర్గాలు, పార్టీలకు అతీతంగా అభిమానించేవారు వున్నారు. 

పట్టణ ఓటర్లు, యువతలో కూడా పివి అంటే అభిమానించేవారు ఇప్పటికీ వున్నారు. వీరు సహజంగా భాజపా అంటే కూడా అభిమానంతో వుంటారు. వీరందరినీ డైలామాలో పడేయడం లేదా ఈ ఓట్లలో చీలిక తీసుకరావడం కేసిఆర్ ప్లాన్ కావచ్చు.

కేసిఆర్ ఎత్తుగడ అయితే వేసారు. కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒకప్పుడు అయితే మేధావులు, ఎక్కువ చదువుకున్నవారికి అవకాశం వుండేది. ఇప్పుడు అంతా మారిపోయింది. 

అక్కడా కులాలు, సమతూకాలు ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. పైగా దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు రంగంలో వున్నారు. కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, భాజపా నుంచి రామ్ చందర్ రావు, తెలుగుదేశం నుంచి రమణ మాత్రమే కాకుండా తరచు తన డిస్కషన్లతో, వీడియోలతో యువతను ఆకట్టుకుని నాగేశ్వర్ కూడా స్వంతంత్రం అభ్యర్థిగా బరిలో వున్నారు. 

అందువల్ల వాణి విజయం అన్నది సులువుగా సాధ్యం అయ్యేది కాదు. కానీ సహజంగా తెరాసకు వున్న ఎడ్జ్ కు, భాజపా, కాంగ్రెస్ ఓట్లు చీల్చడం ద్వారా మరింత పెంచుకుని విజయం సాధించాలన్నది కేసిఆర్ ఎత్తుగడ కావచ్చు.

సాప్ట్ వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమాల్లో న‌టించా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?