cloudfront

Advertisement


Home > Politics - Gossip

ద్రోహం అంటూనే... అక్కున చేర్చుకుంటున్న బాబు...

ద్రోహం అంటూనే... అక్కున చేర్చుకుంటున్న బాబు...

తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సహా తెలుగుదేశం నేతలు కూడా ఎన్నికలకు ముందు మాట్లాడుతున్న మాటలకు ప్రజలు విస్తుపోతున్నారు. అధినేతతో సహా... తెలుగుదేశం నాయకుల మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతోంది. ఏపీ ఆర్థికమంత్రి... యనమల రామకృష్ణుడు తాజాగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ ప్రవేశ పెడుతూ.... ఈ రాష్ట్రాన్ని హేతుబద్దత లేకుండా విభజించారనే మాటలతోనే యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు.

రాష్ట్రాన్ని హేతుబద్దత లేకుండా విభజించిన పాపం పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలోకే వెళుతుంది. విభజన తీరుతెన్నులను రూపొందించింది వారే! ఇప్పటికీ, ఎన్నికల ముందు కూడా రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదనే నెపంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలుగుదేశం పార్టీ... ఆ హేతుబద్ధత లేకుండా విభజించిన కాంగ్రెస్ కు కొత్తగా గులాంగిరీ చేయడానికి ఉబలాటపడుతోంది. అసంబద్ధ విభజనకు ప్రధాన కారణమని గత ఎన్నికలకు ముందు తాను ఆరోపించిన కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు గత కొన్ని మాసాలుగా తన ప్రేమను ఒలకబోస్తున్నారు. రాహుల్ పల్లకీ మోయడానికి ఎగబడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసిందని పదే పదే చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు. పైగా ఇప్పటికీ.. హేతుబద్ధత లేని విభజన అంటూ కాంగ్రెస్ పాపాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు వికటించడంతో... చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఏపీలో విడివిడిగా పోటీచేయాలని నిర్ణయించడం జరిగింది. ఒకపక్క ద్రోహం చేశారని చెపుతూ... కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు కే చెల్లింది.

కేంద్రంలో రాహుల్ భజన చేస్తూ.. రాష్ట్రంలో ఆ పార్టీని అంటరానిదిగా చూస్తున్న ద్వంద్వ వైఖరి కూడా ఆయనకే చెల్లు. అయితే... ఏపీ ప్రజలు తెలివైన వారని... చంద్రబాబు ఆడుతున్న నాటకాలు వారికి తెలుసని... కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుందని చెబుతున్న చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీతో దోస్తీ కట్టడం పట్ల, ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఆయనను మాత్రం ఎలా నమ్మగలరు!

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?