
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మార్కు ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అప్పుడే అనుభవంలోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది.
గత ఏడాది డిసెంబర్ లోనే కోటంరెడ్డి వెళ్లి చంద్రబాబుతో సమావేశం అయ్యారని, ఆ రహస్య సమావేశంలో టికెట్ మీద హామీ పొందిన తర్వాతే ఆయన కొత్త రాజకీయం మొదలుపెట్టారనే ప్రచారం ఒకవైపు జరుగుతూ ఉంది. అసెంబ్లీలోనూ, బయట కూడా అందుకు తగ్గట్టుగా కోటంరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే లకు మించిన స్థాయిలో వీరంగం ఆడుతున్నారు!
అదలా ఉంటే.. ఈయన ఎన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డికి తెలుగుదేశం తరఫున నెల్లూరు రూరల్ టికెట్ దక్కే అవకాశాలు లేదని టాక్. కోటంరెడ్డి వచ్చి చేరితే తాము ఆదరించాలేమంటూ నెల్లూరు రూరల్ టీడీపీ క్యాడర్ అగ్గిమీద గుగ్గిలం అవుతూనే ఉంది.
తమపై విపరీత స్థాయిలో వ్యవహరించిన కోటంరెడ్డిని ఇప్పుడు తమ నెత్తి మీద రుద్దడం ఏమిటనేది వారి వాదన. మరి వాదనే చంద్రబాబుకు అర్థం అయ్యిందో లేక కోటంరెడ్డికి టికెట్ ఇస్తే మొత్తానికే మోసం వస్తుందని అనుకున్నారో కానీ, కొంత మార్పుతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తున్నారట!
శ్రీధర్ రెడ్డికి కాకుండా.. ఆయన సోదరుడికి! మరి ఇంతటితో ఇరు పక్షాలూ శాంతిస్తాయనేది చంద్రబాబు లెక్క కాబోలు. మొత్తానికే సున్నా చుట్టినట్టుగా కాకుండా కోటంరెడ్డి ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పకతప్పని పరిస్థితి.
ఇక టీడీపీ క్యాడర్ కూడా నిన్నటి వరకూ తమను తన్నింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన సోదరుడు కాబట్టి.. ఇక సర్దుకోవాలనమాట! మరి నెల్లూరు రాజకీయం ఇంత తేలికా! అసలు దృశ్యం 2024 ఎన్నికల ఫలితాల్లో కనపడవచ్చు!
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా