Advertisement

Advertisement


Home > Politics - Gossip

ర‌హ‌స్యంగా చంద్ర‌బాబు విహార‌యాత్ర‌..!

ర‌హ‌స్యంగా చంద్ర‌బాబు విహార‌యాత్ర‌..!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు కుటుంబ స‌మేతంగా ప్ర‌స్తుతం విహార యాత్ర‌లో ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ నెల 24 వ తేదీనే చంద్ర‌బాబు నాయుడు థాయ్ ల్యాండ్ వైపుకు విహార యాత్ర‌కు వెళ్లిన‌ట్టుగా స‌మాచారం. 

మామూలుగా అయితే ఇదేమంత వింత కాక‌పోవ‌చ్చు. డ‌బ్బున్న వాళ్లు ఇయ‌ర్ ఎండింగ్ స‌మ‌యంలో, న్యూ ఇయ‌ర్ స‌మ‌యంలో విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌డం పెద్ద క‌థేం కాదు. అయితే ఏపీ ప్ర‌తిప‌క్ష హోదాలో, టీడీపీ అధినేత హోదాలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఈ విహార యాత్ర గురించి మీడియాకు ప్రెస్ నోట్ ఇవ్వొచ్చు. ఈ విష‌యాన్ని టీడీపీనే ప్ర‌క‌టించ‌వ‌చ్చు కూడా! 

అధికారిక హోదాల్లోని వారి విహార యాత్ర‌లు, వ్య‌క్తిగ‌త యాత్ర‌లు కూడా ప్ర‌జ‌ల‌కు తెలిసేవే. అయితే, చంద్ర‌బాబు విహార యాత్ర మాత్రం ర‌హ‌స్యంగా జ‌రుగుతున్న‌ట్టుగా ఉంద‌ట‌. టీడీపీ ముఖ్య నేత‌ల‌కు కూడా చంద్ర‌బాబు గారి విహార‌యాత్ర గురించి తెలియ‌ద‌ట‌. ఆల్రెడీ చంద్ర‌బాబు టూర్ వెళ్లి కూడా ఐదు రోజులు అయిపోయాయంటే వారు ఆశ్చ‌ర్య‌పోతున్న‌ట్టుగా తెలుస్తోంది. 

న్యూ ఇయ‌ర్ ఆరంభం త‌ర్వాతే చంద్ర‌బాబు నాయుడు విహార యాత్ర‌ను ముగించుకుని వ‌స్తార‌ని టీడీపీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయిప్పుడు. మొత్తానికి.. చంద్ర‌బాబు నాయుడు చ‌ప్పుడు లేకుండా టూర్ వెళ్లిన‌ట్టుగా ఉన్నారు! వెళ్ల‌డం నేరం ఏమీ కాదు కానీ.. ఇప్పుడు టూర్ అని ప్ర‌క‌టించుకోవ‌డానికి కూడా భ‌య‌ప‌డిన‌ట్టుగా ఉన్నారు. ఇదే అధికార పార్టీ వాళ్లు టూర్లు వెళితే టీడీపీ నానా ర‌చ్చ చేస్తుంది. అందుకే.. చంద్ర‌బాబు టూర్ ను ర‌హ‌స్యంగా ఉంచుతున్న‌ట్టున్నారు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?