cloudfront

Advertisement


Home > Politics - Gossip

అవేమీ తేలకుండానే.. నిధులు కావాలంట

అవేమీ తేలకుండానే.. నిధులు కావాలంట

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తాను నిరాహార దీక్షకు కూర్చోవడానికి ముందే.. కేంద్రం మీద ప్రయోగించడానికి మరో అన్త్రం సిద్ధం చేసుకున్నారు. పోలవరం తాను పూర్తి చేసేయదలచుకుంటున్నా.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించడమే ఆ అస్త్రం. రాష్ట్రంలో ఏ పనీ జరగకుండా కేంద్రం అడ్డుపడుతోందనే భావన ప్రజల్లో కలిగించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పోలవరానికి నిధులు రాబట్టే విషయంలో.. తాము చేయాల్సిన పని పూర్తిగా చేయకుండానే.. కేంద్రం మీద నిందలు వేసేయడానికి బాబు సర్కార్ సిద్ధం అయిపోతుండడమే విశేషం.

రాష్ట్రం- పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. కొత్త అంచనాలతో రివైజ్ చేసి.. అంచనాలను కేంద్రానికి పంపింది. వాటిని నీతి ఆయోగ్ ఆమోదించడం కూడా పూర్తయింది. అయితే ఈ అంచనాల విషయంలో కేంద్రానికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అంచనాలు రివైజ్ చేయడంలో బాబు సర్కార్ అరాచకంగా నిధుల దోపిడీకి పాల్పడుతున్నదనే విమర్శలు కూడా భాజపా నుంచి విపరీతంగా వినిపిస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం. ఆ నేపథ్యంలో కేంద్రం జల సంఘం కొన్ని సందేహాలను లేవనెత్తుతూ అభ్యంతరాలను రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం వీటిని నివృత్తి చేయవలసి ఉంది. అయితే ఆ సందేహాలకు సమాధానాలు పంపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటిదాకా తీరిక లేదు.

కేంద్రం – రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదనే విషయంలో అందరికీ ఏకాభిప్రాయమే ఉంది. అంత మాత్రాన మన తరఫున మినిమం నిబద్ధత లేకుండా, మనవైపు లోపాలు ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. కేంద్రం అడిగిన సందేహాలను తీర్చేస్తే వారు వాటిని సాకుగా వాడుకోదలచుకుంటున్నారో.. లేదా నిజంగానే అనుమానం వచ్చి అడిగారో తేలిపోతుంది.

ఆ సందేహాలను తీరిస్తే.. ఆ తర్వాత.. ఇంకా తీవ్రస్థాయిలో కేంద్రం మీద పోరాటం చేయవచ్చు. పైగా కేంద్రం నిందిస్తున్నట్లుగా.. పోలవరం పనుల పర్యవేక్షణ బాధ్యత తమకు అక్కర్లేదని చంద్రబాబు సర్కారు చేతులు దులిపేసుకుంటే గనుక.. తమ చేతికి మట్టి అంటకుండా.. ప్రాజెక్టు పూర్తి కావడం గురించి విచ్చలవిడిగా పోరాడడానికి అనుమతి ఉంటుంది.

అలా తాము చేయవలసిన పనులేమీ చేయకుండానే.. కేంద్రం అడిగిన సందేహాలు కూడా తీర్చకుండానే.. మీరు మాత్రం.. ఆపకుండా... నిధులు కంటిన్యువస్ గా విడుదల చేసేయండి.. అని డిమాండ్ చేయడం ఏ మేరకు సబబో.. ప్రజలే విస్తుపోతున్నారు.