Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆధారాలు చూపే సరికి చంద్రబాబుకు షాక్?!

ఆధారాలు చూపే సరికి చంద్రబాబుకు షాక్?!

ఎన్నికల సంఘం అధికారులకు కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హెడ్మాస్టర్ లా క్లాసులు పీకుతూ ఉన్నారు. పోలింగ్ ముందు రోజున ఏపీ ఎన్నికల సంఘం అధికారి ద్వివేదీ వద్దకు వెళ్లి చంద్రబాబు నాయుడు వ్యవహరించిర తీరు వివాదాస్పదంగా మారింది. అక్కడకూ చంద్రబాబు నాయుడును సీఎంగా చాలానే గౌరవించారు ద్వివేదీ. కూర్చోబెట్టి కావాల్సినంత సమయం ఇచ్చారు.

ఆ సమయం చంద్రబాబు నాయుడు సదరు అధికారి మీద చెలరేగిపోయినట్టుగా తెలుస్తోంది. తన చేతిలో లేని అంశాల గురించి కూడా చంద్రబాబు నాయుడు ద్వివేదీ నిందించినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల విషయంలో ద్వివేదీకి క్లాస్ పీకారట చంద్రబాబు నాయుడు! ఆ అంశంపై ద్వివేదీ కామ్ గా ఉండిపోయినా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం నివేదిక అడిగినట్టుగా సమాచారం.

ఆ సంగతలా ఉంటే.. రీ పోలింగ్ వ్యవహారంలో ఢిల్లీ వరకూ వెళ్లి హడావుడి చేయబోయిన చంద్రబాబుకు సీఈసీ గట్టి ఝలక్ ఇచ్చినట్టుగా భోగట్టా. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ ఎందుకు? అంటూ చంద్రబాబు నాయుడు సీఈసీకి తనదైన శైలిలో క్లాస్ పీకపోగా.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చంద్రగిరి చిత్రాలను చూపించారట.

అక్కడ రిగ్గింగ్ జరిగిన తీరు అంతా పోలింగ్ బూత్ లలోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అవే వీడియోలను చంద్రబాబు చూపించారట అధికారులు. దీంతో చంద్రబాబు నాయుడు మారు మాట్లాడలేకపోయినట్టుగా తెలుస్తోంది. అధికారులు ముందే ఆధారాలను రెడీగా పెట్టుకుని చంద్రబాబుకు ఎదురు క్లాస్ పీకినట్టుగా సమాచారం. దీంతో అక్కడ ఏం మాట్లాడేకపోయిన చంద్రబాబు నాయుడు..బయటకు వచ్చి మాత్రం 'అధికారులకు రూల్స్ తెలీవు..' అని అన్నీ తనకే తెలుసునని చెప్పుకుని అక్కడ నుంచి నిష్క్రమించినట్టుగా తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?