cloudfront

Advertisement


Home > Politics - Gossip

హిందూత్వానికి చంద్రబాబు గొడ్డలి పెట్టు!

హిందూత్వానికి చంద్రబాబు గొడ్డలి పెట్టు!

చంద్రబాబు జీవిత పర్యంతమూ రాజకీయ నిర్ణయాలు తప్ప మరొకటి తీసుకున్న చరిత్ర లేదు. రాజకీయ ప్రయోజనాలు ఈడేర్చుకోవడానికి ఆయన ఎంతకైనా తెగిస్తారు గానీ.. దానివల్ల.. మౌలికమైన సామాజిక ప్రయోజనాలకు ఎంత భంగం వాటిల్లుతుంది.. సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది.. అని ఆలోచించిన దాఖలాలు మనకు కనిపించవు.

అదే క్రమంలో తాజాగా చంద్రబాబు చేస్తున్న మరో ప్రతిపాదనను గమనిస్తే.. యావత్తు హిందూ ధర్మాన్ని మంటగలిపేసేలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హిందూ ధర్మాన్ని మంటగలిపేసేలా అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. పైగా.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం.. ఇలాంటి దిగజారుడు హామీలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. హిందూత్వ వాదాన్ని భుజాన మోస్తూ ఉండే కేంద్రంలో కదలిక తెచ్చేలా రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పనిచేస్తానంటూ కూడా చంద్రబాబు బీరాలు పలుకుతున్నారు.

అంబేద్కర్ జయంతి రోజున చంద్రబాబునాయుడు ఎస్సీలకు చాలా వరాలు గుప్పించారు. ప్రధానంగా ఎస్సీలు క్రైస్తవంలో చేరినా సరే.. వారిని ఎస్సీ ఎస్టీలుగానే గుర్తించేలా చట్టం రావాలని ఆయన డిమాండు చేశారు. అందుకోసం రాజ్యాంగ సవరణ వచ్చేలా తాను పోరాడుతా అన్నారు. జైనం, బౌద్ధంలో ఎస్సీలు చేరితే.. వారిని ఎస్సీలుగానే గుర్తిస్తున్నారని.. క్రిస్టియానిటీలో చేరితే మాత్రం గుర్తించడం లేదని చంద్రబాబునాయుడు పాపం.. ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయనకు హఠాత్తుగా ‘‘ఎస్సీలు మరియు క్రిస్టియానిటీ’’ మీద హఠాత్తుగా ఇంత ప్రేమ పొంగుకు రావడానికి సహేతుకమైన కారణాలే ఉన్నాయి. రాష్ట్రంలోని క్రిస్టియన్ వర్గంలో జగన్మోహన రెడ్డికి టగట్టి పట్టు ఉంది. జగన్ కుటుంబానికి క్రిస్టియన్ నేపథ్యం కూడా ఉండడంతో ఆ వర్గం ప్రతిసారీ ఆయనను నెత్తిన పెట్టుకుంటోంది. అందుకని.. తన రాజకీయ ప్రత్యర్థి మూలాల్లో ఉన్న బలాన్ని దెబ్బ కొట్టాలనేది చంద్రబాబునాయుడు తాజా ఆలోచనగా కనిపిస్తోంది. క్రిస్టియన్లను కూడా ఎస్సీలుగా గుర్తిస్తాం అనే హామీ ఇవ్వగానే.. రాష్ట్రంలోని ఎస్సీలంతా.. క్రిస్టియన్లంతా ఎగబడి తెలుగుదేశానికి ఓట్లు వేసేస్తారని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నట్లుంది.

మరి ఇలాంటి నిర్ణయం వలన.. హిందూ ధర్మం సర్వనాశనం అయిపోయినా ఆయనకు ఏమీ పరవాలేదన్నమాట. ఇష్టపూర్వకంగా మతాచారాలు, విశ్వాసాలు రుచించి ఎవ్వరు ఏ మతంలోకి మారినా, ఎన్నిసార్లు మారినా అందులో తప్పులేదు. కానీ ప్రలోభాలతో జరిగే మతమార్పుడులు పెచ్చరిల్లేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది.. పరోక్షంగా మత మార్పిడులను ప్రోత్సహించడమే అనే వాదన ప్రజల్లో వినిపిస్తోంది.