cloudfront

Advertisement


Home > Politics - Gossip

బీసీల్లారా జాగ్రత్త.. బాబు సభ పెడుతున్నారు

బీసీల్లారా జాగ్రత్త.. బాబు సభ పెడుతున్నారు

బీసీలను దువ్వే కార్యక్రమంలో భాగంగా త్వరలోనే ఓ భారీ బహిరంగ సభ పెడుతున్నారు చంద్రబాబు. దీనికి ఓ మాంఛి పంచ్ టైటిల్ కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. సభకు అనుమతులు, ఏర్పాట్ల కోసం ప్రజాధనం పంపకాలు అన్నీ చకచకా సాగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు దెబ్బ చవిచూసిన కొందరు అనుభజ్ఞులైన జనాలు బీసీలకు కొన్ని ముందు జాగ్రత్తలు చెబుతున్నారు. సభలో బాబుకు వ్యతిరేకంగా ఎలాంటి ప్లకార్డులు చూపించొద్దనేది వీళ్లు చెప్పే సూచనల్లో ముఖ్యమైనది. 

మొన్నటికిమొన్న మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు నారా హమారా అనే ప్రొగ్రామ్ పెట్టారు చంద్రబాబు. ప్రభుత్వం ఖర్చుతో సొంత డబ్బా కార్యక్రమం పెట్టుకొని, మైనార్టీలకు అంతా తానే చేసినట్టు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అదే సభలో బాబు చేతకానితనాన్ని బయటపెడుతూ కొందరు ముస్లిం యువకులు ప్లకార్డులు ప్రదర్శించారు. వాళ్లపై చంద్రబాబు తన జులుం చూపించారు. ఏకంగా చార్జ్ షీట్ లో దేశద్రోహం, టెర్రరైజ్డ్ లాంటి పదాలు వాడి, ముస్లిం యువకుల జీవితాల్ని నాశనం చేసేలా వ్యవహరించారు. 

బీసీల సభలో కూడా బాబుకు వ్యతిరేకంగా కచ్చితంగా ఇలాంటి ప్లకార్డులు దర్శనమిస్తాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే, ఈ నాలుగున్నరేళ్లలో బీసీలకు బాబు చేసిందేం లేదు. బీసీ కార్పొరేషన్ పేరుచెప్పి ఆ వర్గాన్ని ఎలా నిలువునా మోసం చేశారో అందరం చూశాం. కాబట్టి బీసీల సభలో బాబుకు నిరసన సెగ తప్పదు. కాకపోతే ఆ నిరసనను జాగ్రత్తగా తెలియజేయాలంటున్నారు విశ్లేషకులు. 'నారా హమామా' కార్యక్రమంలో ముస్లిం యువకులకు పట్టిన గతే, బీసీ సభలో కుర్రాళ్లకు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని హెచ్చరిస్తున్నారు. 

తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ఎంతకు తెగిస్తారో అందరికీ తెలిసిందే. మీడియా ఉన్నా పట్టించుకోకుండా నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానంటూ హెచ్చరించిన ఘనత ఈయనది. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎస్సీలపై ఖబడ్దార్ అంటూ కన్నెర్రజేసిన వ్యక్తి ఈయన. అడ్డొస్తే, అడ్డంగా తొక్కుకుంటూ పోతా అంటూ విపక్షాలను హెచ్చరించిన స్వరం అది. నియంతలా వ్యవహరిస్తున్న ఇలాంటి నేతతో, సామాన్యులు పెట్టుకుంటే అడ్రెస్ లేకుండా పోతారు. అందుకే బీసీలను కాస్త ముందుగానే హెచ్చరిస్తున్నారు బాబు గురించి బాగా తెలిసిన జనాలు.