Advertisement

Advertisement


Home > Politics - Gossip

అభ్యర్థులకు గతిలేక చేతగాని మాటలు

అభ్యర్థులకు గతిలేక చేతగాని మాటలు

రాష్ట్రంలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గతంలో తెలంగాణలో ఎదురైన దుస్థితి తప్పడంలేదు. రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీచేయించడానికి అభ్యర్థులు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అనేకానేక సంక్షేమ పథకాల ఫలితాలు క్షేత్రస్థాయిలో ప్రజలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో వైకాపా వారిని ఢీకొనడం అసాధ్యం అనే అభిప్రాయం అనేకమందిలో కలుగుతోంది. దానివల్ల.. తెదేపాకు కేండిడేట్లు దొరకడం లేదు.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు రివర్స్ స్ట్రాటజీని ఎంచుకున్నారు. తమ పార్టీ తరఫున పోటీచేసే వారిని వైకాపా రౌడీలు బెదిరిస్తున్నారంటూ ఒక ప్రచారానికి దిగుతున్నారు. సాధారణంగా మన పల్లె పట్టుల్లో ఆడలేని నాట్యగత్తె.. మద్దెలు ఓడు అన్నదని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న, మాట్లాడుతున్న తీరు కూడా... ఆ సామెత చందంగానే ఉంది. పార్టీ తరఫున అభ్యర్థులను ఎంచుకోవడానికి గతిలేక.. ఆయన వైకాపా మీద నిందలు వేస్తున్నారు.

చంద్రబాబునాయుడు తొలినుంచి... స్థానిక ఎన్నికల విషయంలో రివర్స్ స్ట్రాటజీలతోనే వెళుతున్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచితే వాటిని అడ్డుకునేలా హైకోర్టులో కేసులు వేయించారు. కేంద్ర నిధులు మురిగిపోకుండా ఉండేందుకు, హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే.. పాత రిజర్వేషన్ పద్ధతిలో ఎన్నికలు ముగించదలచుకుంటే.. వాటిని ఆపించడానికి మళ్లీ సుప్రీం కోర్టులో కేసు వేయించారు. రిజర్వేషన్ లతో ముడిపెట్టి వైకాపా మీద అనేకానేక నిందలు వేశారు.

ఇవన్నీ వర్కవుట్ కాలేదు. మద్యం, ధన ప్రభావాన్ని అరికట్టడానికి జగన్ తెచ్చిన జీవో మీద పడి కొంత విలపించారు. కానీ.. తామే అభాసుపాలవుతామని గుర్తించి వ్యూహం మార్చారు. వైకాపా వారు బెదిరిస్తున్నారని, అభ్యర్థులను పోటీకి దిగనివ్వడం లేదని అంటున్నారు. ఏకగ్రీవాలు జరిగితే ప్రభుత్వ ప్రోత్సాహకాలు వస్తాయనే ఉద్దేశంతో పల్లెలు ప్రశాతంగా ఉంటూ.. కలివిడిగా అభ్యర్థులపై నిర్ణయాలు తీసుకుంటుండగా.. ఆ ప్రశాంతతను చెదరగొట్టడానికి చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

టీడీపీ మళ్ళీ నందమూరి చేతుల్లోకేనా..?

ఒక ప్రిన్సిపల్ కడుపులో గుండాగాడు పుట్టాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?