cloudfront

Advertisement


Home > Politics - Gossip

టీకాంగ్రెస్ పతనం... చంద్రబాబు మహిమేనా?

టీకాంగ్రెస్ పతనం... చంద్రబాబు మహిమేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పతనం అయిపోయినట్టే లెక్క. మరో పదిహేను రోజులు గడిస్తే శాసనమండలిలో ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం అంటూ ఉండదు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార తెరాసలో చేరిపోతే గనుక.. ఇక శాసనసభలో కూడా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా మంటగలిసి పోతుంది.

అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మే అంటూ బొర్ర విరుచుకుని చాటుకునే కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం 95శాతం పూర్తవుతుంది. మంచి జోరు మీద కనిపిస్తున్న తెరాస.. తమ స్కెచ్ ప్రకారంగా మూడింట రెండువంతుల మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే.. సీఎల్పీ విలీనం అయినట్లుగా లెక్కవుతుంది. అక్కడితో తె-కాంగ్రెస్ సర్వభ్రష్టత్వం పరిపూర్ణం అవుతుంది.

ఇప్పుడు ప్రధానాంశం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీ ఈ రేంజిలో నాశనం అయిపోవడానికి చంద్రబాబుతో మైత్రి కారణం అని.. పార్టీలో చర్చ జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లినా సరే.. పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్... సీనియర్ నాయకురాలు.. సబితా ఇంద్రారెడ్డి కూడా వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సబిత కొడుకు కార్తీక్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం, అప్పట్లో తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని చేర్చుకోవడం వలన.. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండడం వల్ల.. సబిత, ఆమె కుమారుడు ఇద్దరూ తెరాసలో చేరిపోతున్నారు.

అయితే ఇలాంటి పరిస్థితి దాపురించడానికి చంద్రబాబు చెలిమి కారణమని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అంటున్నారు. పొత్తుల పుణ్యమాని.. సబిత కొడుకుకు టికెట్ ఇవ్వలేకపోయామని.. ఇప్పుడది పార్టీ నాశనానికి దారితీసిందని అంటున్నారు.

చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడాన్ని రాష్ట్ర నాయకత్వం ఎంతగా వ్యతిరేకించినా.. జాతీయ నాయకత్వం పట్టించుకోలేదని అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించవలసి వస్తున్నదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబు చేసిందే నేను చూపిస్తున్నా.. వర్మ

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!