cloudfront

Advertisement


Home > Politics - Gossip

శవాల మీద కూడా చంద్రబాబు బిజినెస్ ప్లాన్!

శవాల మీద కూడా చంద్రబాబు బిజినెస్ ప్లాన్!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... గతంలో వరుసగా తొమ్మిదేళ్ల పాటూ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు.. తనను అందరూ ముఖ్యమంత్రిగా గుర్తించడం కంటె.. ‘సీఈవో ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ కీర్తించాలని కోరుకునే వారు. ఇప్పుడు రెండో విడత సీఎం అయ్యాక.. ఆంధ్రప్రదేశ్ కు ఆయన సేల్స్ మేనేజర్ గా, మేనేజింగ్ డైరక్టర్ గా తయారయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని భూములను వితరణ చేసేయడానికి రకరకాల బిజినెస్ ప్లాన్స్ తో ముందుకు వస్తున్న నారా చంద్రబాబునాయుడు... తాజాగా శవాల మీద కూడా బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

బుధవారం నాడు చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సదరు సమావేశంలో సహజంగానే కేంద్రలోని భాజపా సర్కారు ఏ రకంగా తమను మోసం చేసిందో చాలా విపులంగా వివరించారు. ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ ను చేరదీసి, వారిని మోడీ ప్రోత్సహిస్తునారని కూడా ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రంలోని మోడీని విలన్ గా తాను ఎస్టాబ్లిష్ చేశారు గనుక.. ఆయనతో కుమ్మక్కు అయినట్లుగా తాను చెబుతున్నారు గనుక.. జనసేన, వైకాపాలకు కూడా ఓట్లు వేయకూడదని యథారీతిగా సెలవిచ్చారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొన్ని కొత్త ఆలోచనలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాలను ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఎవరైనా మరణిస్తే.. మునిసిపాలిటీ వారు వచ్చి....  వారి దగ్గరనుంచి కొంత రుసుము తీసుకుని.. శవయాత్ర పూర్తయిన అరగంటలోగా.. శవం మీద చల్లిన పూలు రోడ్డు మీద పడి ఉండగా వాటిని శుభ్రం చేసేస్తారట. ఈ అయిడియా చంద్రబాబుకు తెగ రుచించినట్లుంది. అలాంటి కొత్త కొత్త ఆలోచనలు రావాలంటూ ఆయన పిలుపు ఇచ్చారు.

అంటే త్వరలోనే శవాలమీద కూడా బిజినెస్ చేయడానికి చంద్రబాబునాయుడు కొత్త చట్టాలు తేబోతున్నారన్నమాట. శవయాత్ర జరిగితే.. రుసుము కట్టకపోతే.. శవం మీద చల్లిన పూలు తీసేయరా? ఎన్ని పూలు శవం మీద చల్లితే ఎంత రుసుము కట్టాలి? కొద్ది పూలు మాత్రమే చల్లుకునే పేదలు కూడా రుసుము కట్టాల్సిందేనా? బాబు ఐడియాలో ఇవన్నీ ప్రశ్నలే.

చంద్రబాబులో ఇన్నాళ్లూ మనం చావులతో ఎలా ఓట్లేయించుకోవాలా? అనే తెలివితేటలు మాత్రమే చూశాం. ఇకమీదట చావులమీద ఎలా సొమ్ములు సంపాదించాలా? అనే తెలివితేటలు కూడా చూడాల్సి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.