Advertisement

Advertisement


Home > Politics - Gossip

కేబినెట్ భేటీ.. చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్!

 కేబినెట్ భేటీ.. చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్!

'ఈసీ ఎవరు.. సీఈసీకి ఏం  హక్కుంది..' అంటూ వీరావేశంతో ఊగిపోయిన చంద్రబాబుకు వాళ్లెవ్వరో బాగానే అర్థం అయ్యింది. వాళ్ల అనుమతి లేనిదే తాము సచివాలయంలో చిన్న మీటింగ్ పెట్టలేకపోయారనే అంశం గురించి బాగానే స్పష్టత వచ్చింది. కాబట్టి.. ఈసీ ఎవరో, సీఈసీకి ఉన్న పవర్సేమిటో చంద్రబాబుకు బాగా అర్థం అయ్యింది!

అంతేనా.. 'సీఎస్ అంటే ఎంత',  'అధికారులు ఎలా రారో చూస్తా..' అంటూ మాట్లాడిన చంద్రబాబుకు వాళ్ల స్థాయి ఏమిటో కూడా బాగానే అర్థం అయినట్టుగా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడి కేబినెట్ మీటింగ్ అధికారులను ప్రస్తుతించడానికే బాగా ఉపయోగపడినట్టుగా ఉంది!

కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీ అధికారగణాన్ని అభినందించారట! 'ఫొని' తుఫాను వేళ వారు అందించిన సహాయ కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు అభినందించారట. తుఫాను విషయంలో సహాయక కార్యక్రమాలు బాగా జరిగాయన్నారట. 

అయినా చంద్రబాబు థియరీలు ఇలా ఉండకూడదు! తుఫాన్ వచ్చినప్పుడు ఆయనకు అధికారం లేదు కాబట్టి.. అంతా అస్తవ్యస్తం అయ్యిందని, అధికారులు సహాయ కార్యక్రమాలను సరిగా చేపట్టలేదని.. ఆయన వీరాభిమానులు అంటున్నారు. 'తుఫాన్ ను ఎదుర్కొవడం' చంద్రబాబుకే సాధ్యం అంటున్నారు. అయితే బాబు మాత్రం అధికారులను అభినందించారట!

ఇక మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే.. 'అధికారులతో మాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు..' అనేశారు. మరి వీళ్లే కదా… మొన్నటి వరకూ అధికారుల మీద ఫైర్ అయిపోయింది. అధికారులను వారెంత వారి స్తాయెంత అని మాట్లాడింది, ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకున్నారేంటిని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?