cloudfront

Advertisement


Home > Politics - Gossip

దొంగమార్గాలు ఎంచుకుంటున్న చంద్రబాబు

దొంగమార్గాలు ఎంచుకుంటున్న చంద్రబాబు

అసలే చంద్రబాబు.. ఆయనకు అపరిమితమైన తెలివితేటలు లేకుండా ఎలా ఉంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒకరీతిగా ప్రభుత్వంతో పనిపడి.. ప్రభుత్వ రికార్డుల్లోకి తమ మొబైల్ నెంబరు ఎక్కించుకున్న ప్రతివారికీ చంద్రబాబునాయుడు ప్రమోషనల్ కాల్స్ చేయడం ఒక అలవాటుగా మారింది. ప్రభుత్వ పథకాల గురించి స్వోత్కర్ష.. అవి ఎలా ఉన్నాయో తెలుసుకునే ఫీడ్ బ్యాక్ కాల్ కింద... ఈ ప్రహసనం నడిపిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో కూడా చంద్రబాబు సరికొత్త తెలివితేటలను ప్రదర్శిస్తున్నట్లుగా తాజాగా అర్థమవుతోంది.

ఏపీలో ఏ చిన్న పనికైనా సరే.. ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే చాలు.. సదరు వ్యక్తుల ఫోను నెంబరు ప్రభుత్వ రికార్డుల్లోకి చేరిపోతుంది.. అక్కడినుంచి వారికి ‘ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఆశ్రయించాంరా.. భగవంతుడా’ అని అనుకునేదాకా చిరాకు పుట్టించగలిగేందుకు చంద్రబాబు పూచీ తీసుకంటారు. అడపాదడపా మీకు తరచుగా ఫోన్ కాల్స్ వస్తాయి. ‘నమస్కారం.. నేను మీ చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నాను... ’ అంటూ ఆయన తొలుత పరిచయం చేసుకుంటారు.

తర్వాత.. ప్రభుత్వ పథకాలు ఎలా జరుగుతున్నాయో అడుగుతారు. వాటికి రేటింగ్ ఇవ్వమని అడుగుతారు. సాక్షాత్తూ చంద్రబాబు ఫోన్ చేస్తే మాట్లాడ్డానికి ఏంటి ఖర్మ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అంతా రికార్డెడ్ వాయిస్ మాత్రమే. పింఛను, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల దగ్గరినుంచి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ధ్రువపత్రాలు తీసుకునే వారి వరకు ప్రతి ఒక్కరూ ఈ బాధితులే. సాధారణంగా చంద్రబాబునాయుడు ఫోన్ కాల్స్ 0866- ఎస్టీడీ కోడ్ నెంబరుతో ప్రారంభయ్యే ఫోన్లనుంచి వస్తుంటాయి.

ఈ రోజుల్లో ల్యాండ్ నెంబరు నుంచి కాల్ వస్తున్నదేమిటా? అని ఆశ్చర్యపోతూ ఫోన్ ఆన్సర్ చేశామంటే.. బాబుగారు.. మనల్ని పరామర్శించడం ప్రారంభిస్తారు. ఏపీలోని తెలుగు ప్రజలకు, ఏపీ రికార్డుల్లోనూ తమ నెంబర్లున్నందుకు ఇతర ప్రాంతాల్లో బతుకుతున్న వారికి కూడా ఈ హింస తప్పదు. క్రమంగా ప్రజలకు ఈ నెంబర్లు అలవాటైపోయాయి. 0866..తో ప్రారంభమయ్యే నెంబరు రాగానే.. చంద్రబాబు స్వరం వినాలనే ముచ్చట ఉన్నవారు తప్ప.. కాల్ కట్ చేయడం ప్రారంభించేశారు.

దీంతో చంద్రబాబు సరికొత్త దొంగమార్గాలను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. 009911 లాంటి అయిదారు అంకెలు మాత్రమే డిస్ ప్లేలో కనిపించేలా ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి. ఇదేదో నెంబరు అర్థం కావడంలేదే అని కొందరు, విదేశీ మిత్రులు కాల్ చేస్తున్నారేమో అని కొందరు పొరబాటుగా ఆన్సర్ చేసేస్తే మళ్లీ చంద్రబాబు పరిచయవాక్యాలు ప్రారంభం అయిపోతాయి.. ఆవెంటనే కట్ చేయడం రివాజు అయిపోతోంది. తన బారినపడ్డ పాపానికి ఇలా ప్రజల్ని విసిగించడాన్ని చంద్రబాబు ఎప్పటికి మానుకుంటారో మరి!

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

అటు జనం.. ఇటు భయం, పవన్ ఒంటరిగా వెళ్లాలి.. ఇదే అభిమానుల కోరిక!