cloudfront

Advertisement


Home > Politics - Gossip

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చంద్రబాబు ఒంటరి!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చంద్రబాబు ఒంటరి!

దేశంలో ఉన్న రాజకీయ పార్టీలనుంచి జాతీయ న్యాయకమిషన్ అభిప్రాయాలు తెలుసుకునే పనిలో ఉన్నది గనుక.. ఇప్పుడు ప్రతిచోటా జమిలి ఎన్నికలకు సంబంధించిన చర్చ నడుస్తోంది. ఆ కోణంలోంచి చూసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబునాయుడు ఒక్కరే ఒంటరిగా మిగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

కేవలం జమిలి ఎన్నికల పట్ల తమ అభిప్రాయాలను వెల్లడించే విషయంలో మాత్రమే కాదు. మరో కోణంలో చూసినా కూడా చంద్రబాబు ఒంటరిగానే కనిపిస్తున్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఎట్ లీస్ట్ ఏదో ఒక విషయంలో భావసారూప్యత అనేది ఏదో ఒక రెండు పార్టీల మధ్య కనిపిస్తోంది. కానీ.. ఒక్క తెలుగుదేశం మాత్రం అన్ని విషయాల్లోనూ అందరినీ తప్పు పడుతూ.. తాము ఒక్కరు మాత్రమే పరిశుద్ధాత్మ స్వరూపులం అన్న బిల్డప్ తో ముందుకు సాగుతోంది.

జమిలి ఎన్నికల విషయంలో జాతీయ న్యాయ కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఏడాది కిందట జమిలికి జై కొట్టిన చంద్రబాబు తాజాగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. కావాలంటే కేంద్రం ముందస్తుకు రావచ్చు.. మేం మాత్రం రాం. మా పదవీకాలం పూర్తయ్యాక జమిలి ఎన్నిక పెడితే అభ్యంతరం లేదు... అంటూ రకరకాలు అర్థం పర్థం లేని అనుమానాలను లేవదీస్తూ ఆయన జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించారు.

అయితే ముందస్తుకు కూడా సిద్ధమే అంటూ తెలంగాణలో పాలనలో ఉన్న తెరాస జమిలికి అనుకూల ఓటు వేసింది. మంగళవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్  కూడా ఎన్నికల ఖర్చు తగ్గితే దేశానికి మంచిదే గనుక... జమిలి తాము అనుకూలం అంటూ అభిప్రాయం చెప్పేసింది. ఇక పోతే.. జాతీయ పార్టీలు జమిలికే మొగ్గుతాయి గనుక.. కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు. భాజపా ఎటూ వారి పక్షమే.

ఈ రెండు రాష్ట్రాల్లో ఇంకా బొడ్డూడని పార్టీ అయిన జనసేన అభిప్రాయాన్ని ఈ విషయంలో అడుగుతారో లేదో తెలియదు. ఒకవేళ అడిగితే గనుక.. ‘జమిలికి  జై’ అంటూ పెద్దపెట్టున నినదించడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగానే ఉంటారని అనుకోవచ్చు.

ఇక మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విషయంలో చంద్రబాబునాయుడు ఒక్కరే ఒంటరిగా మిగిలిపోయినట్లు కనిపిస్తోంది. ఈ ఒంటరితనం భవిష్యత్ సమీకరణాలకు కూడా సంకేతమేనా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.