Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఈ పునరావాస కేంద్రాల కామెడీ ఏంటి చంద్రబాబూ!

ఈ పునరావాస కేంద్రాల కామెడీ ఏంటి చంద్రబాబూ!

తెలుగుదేశం పార్టీ వాళ్లు ఒకే అజెండానే నమ్ముకున్నట్టుగా ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు దాడులు చేస్తున్నారంటూ అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్ లు రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి అంటూ కార్యకర్తలు వస్తున్నారని ప్రచారం చేయగా, ఇప్పుడు కార్యకర్తలే చంద్రబాబు వద్దకు వచ్చి పరామర్శలు కోరుకుంటున్నారట.

అందుకు సంబంధించిన ఫొటోల్లో ఏడుపులు, పెడబొబ్బలను హైలెట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జూనియర్ ఆర్టిస్టులతో దొరికిపోయింది. జూనియర్ ఆర్టిస్టులను రైతులుగా చూపించి ప్రభుత్వాన్ని అర్థరహితంగా దూషించి పట్టుబడింది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబును కలుస్తున్న వారు ఏ రేంజ్ ఆర్టిస్టులో అంతుబట్టని అంశంగా ఉంది.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేత బాధింపబడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పునరావస శిబిరాలను ఏర్పాటు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బాధితులు అంతా ఆ పునరావాస కేంద్రాలను చేరుకోవాలని ఆయన సూచిస్తున్నారట. వాటిని గుంటూరులో నిర్వహిస్తారట. రాష్ట్రంలోని తెలుగుదేశం కార్యకర్తలు అంతా  అక్కడకు చేరుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు.

ఇంతవరకూ చాలా రకాల పునరావాస కేంద్రాలను చూశారు జనాలు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అవి ఏర్పాటు అవుతూ ఉంటాయి. అయితే చంద్రబాబు నాయుడు ఏకంగా రాజకీయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేశారు. మరి ఎన్ని రోజుల పాటు వాళ్లను చంద్రబాబు నాయుడు పోషిస్తారో ఎవరికీ తెలీదు.

అయితే మరి కొందరు వీటిని ఒట్టి ప్రహసనంగా భావిస్తున్నారు. ఇదంతా డ్రామా అని వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వైరాలు గ్రామస్థాయిల్లో పరస్పర దాడులకు దారి తీయడం కొత్త ఏమీ కాదనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్లాకా అలాంటి దాడులు తెలుగునాట మొదలయ్యాయని వారు చెబుతున్నారు.

తెలుగుదేశం హయాంలో రాయలసీమలో కొన్ని వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలను హత్య చేయించిన వైనాలను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో తెలుగుదేశం ఫ్యాక్షనిస్టులు అక్కడ రాక్షస కాండలను సృష్టించారని.. వాటిని స్ఫూర్తి పొంది అధికారం చేతిలో ఉన్న వేళ తెలుగుదేశం వాళ్లు ఎక్కడిక్కడ రౌడీయిజం చేశారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో సంక్షేమపథకాల అమలు విషయంలోనే తమ పార్టీ వాళ్లకే అన్నీ అనే నియమాన్ని వ్యక్తం చేశారని, అలాంటిది ప్రత్యర్థుల మీద దాడులు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో జరిగిపోతోందని డ్రామాలను రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెలుగులో సినీప్రియుల రూటు మారింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?