cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఏపీలో కళా శంఖం ఊదుతారా?

ఏపీలో కళా శంఖం ఊదుతారా?

చంద్రబాబునాయుడు శనివారం నాడు హైదరాబాదుకు వచ్చి.. ముందస్తు ఎన్నికల సన్నద్ధత కోసం అన్నట్లుగా పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి వెళ్లారని.... పార్టీకి స్ఫూర్తి ఇచ్చారని, వ్యూహాల పరంగా దిశానిర్దేశం చేశారని ఇలా పలురకాలుగా ఆయన అభిమానులు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ.. వాస్తవంలో శనివారం నాటి చంద్రబాబునాయుడు షెడ్యూలును గమనించిన వారు మాత్రం.. ఆయన నందమూరి హరికృష్ణ దశదినకర్మకు హాజరయ్యే నిమిత్తం హైదరాబాదుకు వచ్చి.. ఎటూ ఖాళీ సమయం ఉంది గనుక.. కాసేపు పార్టీ సమావేశం పెట్టి వెళ్లారని అనుకుంటున్నారు.

అన్నింటినీ మించి.. ముందస్తు ఎన్నికలకు పార్టీ సన్నద్ధం కావడం కోసం నిర్వహించిన ఈ సమావేశంలో... తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎల్. రమణ శంఖం పూరించడం చూసి పలువురు నివ్వెరపోయారు. శంఖం పూరిస్తూనో, చేతిలో ఖడ్గం, ధనుర్బాణాలు వంటివి పట్టుకునో వేదిక మీది నుంచి ఫోటోలకు పోజులివ్వడం అనేది సాధారణంగా చంద్రబాబునాయుడు చేసే పని. కానీ ఈసారి రమణ ఆ పనిచేయడం పలువురిని నివ్వెర పరచింది.

పార్టీలో మోనార్క్ వ్యవహార సరళికి, మోనోపలికి పెట్టింది పేరైన చంద్రబాబు, రమణకు ఆమాత్రం ప్రాధాన్యం ఇవ్వడాన్ని పలురకాలుగా పలువురు అభివర్ణిస్తున్నారు. తెలంగాణలో ఎటూ పార్టీకి పరాభవం తప్పదు గనుక.. దానిని తన ఖాతాకు అంటకుండా చూసుకోవడానికి ... కనీసం శంఖం పట్టుకునే పని కూడా చంద్రబాబు తీసుకోలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతే తప్ప.. తెలుగుదేశం ఇది అంతర్గత ప్రజాస్వామ్యం అనుకోవడానికి వీల్లేదని అంటున్నారు.

చంద్రబాబుకు ఇలాంటి శ్రద్ధ నిజంగానే ఉంటే గనుక.. రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఎన్నికలకు సిద్ధమయ్యే తొలిసభను నిర్వహించినప్పుడు కూడా... అక్కడి పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతోనే శంఖం పూరింపజేయాలని.. అంతేతప్ప.. గెలవాలనే కోరిక ఉన్నచోట మాత్రం.. తాను శంఖం పట్టుకోవడం.. ఓడిపోయే భయం ఉన్నచోట మరొకరికి ఇవ్వడం అనేది పలాయనవాదానికి నిదర్శనం అని పలువురు అంటున్నారు.