cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబు-షర్మిల-రెండు పాయింట్లు

చంద్రబాబు-షర్మిల-రెండు పాయింట్లు

వయసు మీద పడడం వల్లనో, కేవలం జగన్ ను ఏదో విధంగా విమర్శించాలన్న ఆలోచనో కానీ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో? ఆయనకే తెలియడం లేదు. షర్మిల పార్టీ ఉదంతాన్నే చూసుకోండి. 

షర్మిలకు ఎంపీగా అవకాశం ఇవ్వలేదని, ఇంటి ఆడపడుచుకే జగన్ అన్యాయం చేసారనే అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడారు. కానీ కానీ ఆయన ఇక్కడ రెండు లాజిక్ లు విస్మరించారు.

ఒకటి. చంద్రబాబు ఏం చేసారు. బావమరిది కమ్ వియ్యంకుడు బాలయ్య ను ఎమ్మెల్యేను చేసారు. కొడుకు లోకేష్ ను ఎమ్మెల్సీ ని చేసారు. దీన్ని ఏమంటారు కుటుంబ పాలన అంటారు. 

రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు కామన్. కేసిఆర్ మీద కూడా ఇలాగే వున్నాయి.  జగన్ ఆ తప్పు పని చేయలేదు కదా. నిజానికి జగన్ అలాగే చేసి వుంటే చంద్రబాబు అండ్ కో ఏమని అనేవారు? రివర్స్ లో విమర్శలు కురిపించేవారా? కాదా? 

ఇక రెండో విషయం. జగన్ ఎంపీ అవకాశం ఇవ్వనందునే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని బాబుగారు కన్ ఫర్మ్ చేసారు. ఓ విధంగా జగన్ నెత్తిన పాలు పోసినట్లు. జగన్ కు కేసిఆర్ కు మంచి సంబంధాలు వున్నాయి. 

జగన్-షర్మిల కూడబలుక్కుని పార్టీ పెట్టారని టాక్ వస్తే అవి కాస్తా చెడతాయి. అలా కాకుండా జగన్ అవకాశం ఇవ్వకే షర్మిల పార్టీ పెట్టారు అని వస్తే ఇక సమస్య లేనట్లే. ఆ విధంగా కూడా బాబు పప్పులో కాలేసినట్లే. 

నిజానికి షర్మిల ధైర్యం మెచ్చుకోవాలి. బాబుగారు తన దుకాణం ఆల్ మోస్ట్ మూసేవారు. పవన్ తన దుకాణం తెరవనే లేదు. ఇద్దరూ కూడా కేసిఆర్ పాలన మీద పల్లెత్తు మాట అనడం లేదు. అలాంటిది ఓ ఆడకూతురు పార్టీ పెట్టి, విమర్శలు చేయడం అంటే మెచ్చుకోవాల్సిందే.

గబ్బర్ సింగ్ ను మించేలా పవన్ తో సినిమా..

‘ఉప్పెన’ మన నేటివ్‌ కథ 

 


×