cloudfront

Advertisement


Home > Politics - Gossip

టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ కూడా విలీనమా!

టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ కూడా విలీనమా!

గత పర్యాయంలోనే తెలుగుదేశం లెజిస్ట్లేటివ్ పార్టీని తెరాసలోకి విలీనం చేస్తున్నట్టుగా ఏదో హడావుడి చేశారు. ఈసారి కేసీఆర్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఇంకేముంది.. ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఎర్త్ పెడుతున్నాడట. సాంకేతికంగా చెల్లుతుందా, విమర్శలు వస్తాయా.. అనే లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ లెజిస్ట్లేటివ్ పార్టీని తెరాసలోకి విలీనం చేసే ఆలోచనలో ఉన్నాడట కేసీఆర్.

ఈ మేరకు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసతో జోరుగా చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేల్లో మూడింట రెండువంతుల మందిని ఒకేసారి తెరాసలోకి చేర్చుకునే ప్రతిపాదన ఉందని తెలుస్తోంది.

మూడింట రెండువంతుల మంది ఎమ్మెల్యేలు చేరారు కాబట్టి.. అసెంబ్లీలో కాంగ్రెస్ ను తెరాసలోకి విలీనం అయినట్టుగా స్పీకర్ కు లేఖను ఇచ్చే రాజకీయం నడవబోతోందని సమాచారం. వారి ఆమోదం ఉన్నా.. సాంకేతికంగా అది చెల్లుబాటు అవుతుందా? అనే లాజిక్ తో ఎవరికీ పనిలేకుండా పోయింది. ఇలా తగలడింది మన ప్రజాస్వామ్యం.

ఇప్పటికే ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెరాసతో చర్చల్లో ఉన్నారట. అయితే ఒకేసారి 13 మందిని చేర్చుకోవాలి అనేది తెరాస ఆలోచన అట. ఆ మేరకు సంప్రదింపులు జరుగుతున్నట్టుగా సమాచారం. ఒక్కొక్కరిని ఒక్కోసారి కాకుండా.. 19 మందిలో 13 మందిని ఒకేసారి చేర్చుకుని.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రసమితిలోకి విలీనం అయిపోయిందని ప్రకటించేయనున్నారని సమాచారం!

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది