cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఏపీ ఎన్నికలు.. కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి?

ఏపీ ఎన్నికలు.. కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి?

ఏపీ ఎన్నికల్లో ఇంతకీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? ఒకదశలో 'బాగా పుంజుకుంటోంది..' అని చంద్రబాబు చేత కితాబులు అందుకున్నకాంగ్రెస్ పార్టీ అంతిమంగా ఎలాంటి ఫలితాలను పొందబోతోంది? అనేది ఆసక్తిదాయకమైన అంశం. ఏపీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టుకుంది!

ఏకంగా ముఖ్యమంత్రి అయిపోతానంటూ ప్రచారం చేసుకున్న పవన్ కల్యాణ్ పార్టీ జనసేన నిలిచిన స్థానాల కంటే చాలా ఎక్కవ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీచేశారు. దాదాపుగా ప్రతి ఈవీఎంలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనిపించారు.

కనిపించడం వరకూ ఓకే కానీ, వారు ఏం సాధించారు అనేదే ప్రశ్న. ఏతావాతా చూసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతమంది డిపాజిట్లు సాధించలరు? అనేదే బెట్టింగ్ అంశం. కనీసం ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిచి డిపాజిట్ రుసుమును ఈసీ నుంచి వెనక్కు తెచ్చుకోగలరా? అనేది సందేహంగానే కనిపిస్తూ ఉంది.

చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గత ఐదేళ్లలో ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. పరిస్థితి చూస్తుంటే.. ఈసారి కూడా అదే రిపీట్ కాబోతోందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.  కాంగ్రెస్ కనీసం ఒక్క సీట్లో కూడా విజయం సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు తేల్చేస్తున్నారు.

కల్యాణదుర్గంలో రఘువీరా రెడ్డి చాలానే కష్టపడ్డారు, 'ఖర్చు'పడ్డారు కూడా! అక్కడ తెలుగుదేశం కూడా రఘువీర విజయం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తిని పోటీ చేయించింది. అలా రఘువీర గెలుపుకు తెలుగుదేశం తనవంతు సహకారం అందించినా ప్రయోజనం కనపడలేదని టాక్.

రఘువీరకు యాదవుల ఓట్లు అక్కడ కొంతవరకూ పడినా, పాత అనుచరగణం కొంతవరకూ సహకరించినా.. పార్టీకి బేస్ మెంట్ లేకపోవడంతో... ఊపు కనిపిచండం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు!

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!