cloudfront

Advertisement


Home > Politics - Gossip

కాంగ్రెస్‌ని ఈ సినీ గ్లామర్‌ గెలిపిస్తుందా.?

కాంగ్రెస్‌ని ఈ సినీ గ్లామర్‌ గెలిపిస్తుందా.?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆ పార్టీకి చెందిన జాతీయస్థాయి నాయకులు చాలామంది తెలంగాణలో మకాం వేశారు. కొత్తకొత్తగా ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ ప్రముఖ నేతలు రంగంలోకి దిగుతూనే వున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, సినీనటి, మాజీఎంపీ విజయశాంతి సంగతి పక్కన పెడితే, మరో సినీనటి ఖుష్బూ తెలంగాణ ఎన్నికల్లో చాలా యాక్టివ్‌గా కన్పిస్తున్నారు.

తెలుగు, ఇంగ్లీషు, హిందీల్లో ప్రసంగాలతో ఖుష్బూ ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. విజయశాంతి, ఖుష్బూ మాత్రమేకాదు, మరో సినీనటి నగ్మా కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారంలో జోరు పెంచారు. పలు నియోజకవర్గాల్లో నగ్మా జోరుగా ప్రచారం నిర్వహిస్తుండడం గమనార్హం.

విజయశాంతి, ఖుష్బూ, నగ్మా.. ఈ ముగ్గురూ తెలుగు తెరపై ఓ రేంజ్‌ స్టార్‌డమ్‌ పొందినవారే. విజయశాంతి, నగ్మా ప్రస్తుతం సినిమాలు తగ్గించేయగా, ఖుష్బూ మాత్రం అడపాదడపా ఇంకా తెలుగు సినిమాల్లో కన్పిస్తూనే వున్నారు. ఈ సినీ గ్లామర్‌, తమకు ఎన్నికల్లో బాగా కలిసొస్తుందని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

ఒకప్పుడు కేసీఆర్‌ చెల్లెమ్మగా రాజకీయ తెరపై హల్‌చల్‌ చేసిన విజయశాంతి, ఇప్పుడు ఆ మాజీ అన్నయ్యకి యాంటీగా కాంగ్రెస్‌ నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కేసీఆర్‌ని నిలదీయడంలో విజయశాంతి తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

ఖుష్బూ సంధిస్తున్న ప్రశ్నలూ, టీఆర్‌ఎస్‌కి ఒకింత ఇబ్బందికరంగానే మారాయి. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు చోటు లేదన్నది కాంగ్రెస్‌ చేస్తోన్న ఆరోపణ. ఖుష్బూ ఈ ఆరోపణని కాస్త గట్టిగా చేస్తుండడం గమనార్హం.

తెలంగాణలో ఈ సినీ గ్లామర్‌ గనుక వర్కవుట్‌ అయితే, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ ముగ్గురితో ప్రచారం నిర్వహించాలన్నది కాంగ్రెస్‌ వ్యూహమట. మరి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ నుంచి రోజా రూపంలో మంచి వాగ్ధాటిగల మహిళానేత వున్నారాయె.

ఆమె కూడా సినీనటి. మరి, రోజా వర్సెస్‌ ఖుష్బూ - నగ్మా - విజయశాంతి అనుకోవచ్చా.? ముందైతే, తెలంగాణలో ఈ ముగ్గురి కారణంగా కాంగ్రెస్‌ గట్టెక్కే పరిస్థితి వుండాలి కదా.!

మంత్రిగారికి ఓటమి తప్పదు.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్