Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబు పరువు కాపాడిన లాక్ డౌన్!

చంద్రబాబు పరువు కాపాడిన లాక్ డౌన్!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి... కొన్ని దశాబ్దాల అప్రతిహతమైన కాంగ్రెసు పాలనకు చరమగీతం పాడిన చారిత్రాత్మకమైన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం. ఆ వేడుక ఎంత వైభవంగా జరగాలి. కానీ.. చాలా చాలా చప్పగా జరిగిపోయింది. ఒకరు-ఇద్దరు నాయకులు మాత్రం పార్టీ జెండా ఎగరేసి, వ్యవస్థాపకుడు రామారావు బొమ్మ వద్ద టెంకాయకొట్టడంతో పండగ అయిపోయింది. ఇది కేవలం కరోనా దెబ్బ. అయితే ఈ కరోనా లాక్ డౌన్ దెబ్బే.. చంద్రబాబునాయుడు పరువు కూడా కాపాడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సరిగ్గా ఒక సంవత్సరం ముందుకు వెళితే.. ఈ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. చంద్రబాబునాయుడు హవా నడిపిస్తున్నారు. పైగా ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్న తరుణం అది. దాంతో మరింత అంగరంగ వైభవంగా ఊరూవాడా అంతా వేడుకలు నిర్వహించారు. చాలా గొప్పగా చేశారు.

ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యంత దారుణమైన పరాభవం వారిని వరించింది. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎందరు పార్టీలో ఉన్నారో  ఎందరు వెళ్లిపోయారో నాయకుడికే తెలియని పరిస్థితి. పైగా స్థానిక ఎన్నికల వాతావరణం. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో సాధారణ వాతావరణం ఉంటే గనుక.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చి ఉంటే గనుక.. అభాసు పాలై ఉండేవారు. నాయకులు ఎక్కడి కక్కడ కాడి పక్కన పారేసి ఉంటే పరువు పోయి ఉండేది.

అయితే చంద్రబాబునాయుడు పరువు కాపాడడానికే అన్నట్లుగా కరోనా లాక్ డౌన్ వచ్చింది. హైదరాదులోని తన ఇంట్లో చంద్రబాబు సడీచప్పుడూ లేకుండా.. తన కొడుకు తన మనవడితో కలిసి టెర్రేస్ మీద పార్టీ జెండా ఎగరేసి టెంకాయ కొట్టి వేడుక అయిందనిపించారు. నాయకులందరూ తమతమ ఇళ్లమీదే పార్టీ జెండాలు ఎగరేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు ఎందరికి వినిపించిందో.. ఎందరు ఆచరించారో కూడా తెలియదు.

ఆ రకంగా కరోనా లాక్ డౌన్ అనేది చంద్రబాబునాయుడు పరువు కాపాడడానికే వచ్చినట్లుగా ఉన్నదని పలువురు నవ్వుకుంటున్నారు.

క‌రొనా పై చిరు-నాగ్ పాట చూశారా?

ఏప్రిల్ 7వ తేదీకి కేసులన్నీ ఖతం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?