cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ ను నమ్ముకుని ఊసులో లేకుండా పోయారా!

పవన్ ను నమ్ముకుని ఊసులో లేకుండా పోయారా!

తెలంగాణ ఎన్నికల్లో ఊసులో లేకుండా పోయింది సీపీఐ(ఎం). ఒకవైపు తెరాస హడావుడి చేస్తోంది. మరోవైపు మహాకూటమి అంటూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు ప్రత్యామ్నాయం తమే అంటున్నాయి. ఎన్నికలు అంతా ఈ హడవుడిగానే సాగుతున్నాయి. అయితే తెరాసనా లేకపోతే మహాకూటమా అనే చర్చ మాత్రమే నడుస్తోంది. ఎటొచ్చీ సీపీఎం మాత్రం ఉనికిని కూడా చాటుకోలేకపోతోంది.

తెలంగాణ ఎన్నికల విషయంలో సీపీఎం వేసిన ప్రణాళిక వేరే. ఇప్పుడు జరుగుతున్నది మరోటి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అంటూ సీపీఎం లెక్క లేసింది. అందులో పవన్ కల్యాణ్ ను ముగ్గులోకి లాగాలని ప్రయత్నాలు జరిగాయి. చర్చలు కూడా జరిగాయి. మొదట్లోనేమో దీనికి ఊకొట్టిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మాత్రం కామ్ అయిపోయాడు.

పవన్ కల్యాణ్ తమతో వస్తాడు.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అంటూ జనాల్లోకి వెళ్లవచ్చని సీపీఎం ఆశించింది. పవన్ మీద ఆశలతో మహాకూటమిని కూడా పట్టించుకోలేదు. మొదట్లోనే సీపీఎం గనుక మహాకూటమితో వెళ్లి ఉంటే.. దానికీ ఎన్నో కొన్ని సీట్లు దక్కేవి. అధమ పక్షంగా నాలుగైదు సీట్లను సంపాదించుకోగలిగేది. అయితే.. పవన్ మాయలో కూటమిని పట్టించుకోలేదు.

మొదట్లలో వీళ్లను ఊరించిన పవన్ తర్వాత ఆ ఊసు ఎత్తడంలేదు. ఇలాంటి నేపథ్యంలో సీపీఎం తెలంగాణ ఎన్నికల రణరంగంలో ఉనికి చాటుకోలేకపోతోంది. బహుజన లెఫ్ట్ ప్రంట్ అని ఇప్పుడూ అంటున్నప్పటికీ, ఇందులో ఇరవై ఆరు పార్టీలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. ఎక్కడా ఒకచోట డిపాజిట్ సాధించగలిగే పార్టీలు కావు అవి.  

ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్