cloudfront

Advertisement


Home > Politics - Gossip

‘తెంచుకుంటాం’ హెచ్చరికల అంతరార్థం వేరే?

‘తెంచుకుంటాం’ హెచ్చరికల అంతరార్థం వేరే?

తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీలు (చంద్రబాబు సూచనల మేరకు) ప్రస్తుతం ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నారంటే.. భారతీయ జనతా పార్టీతో వీరి బంధం ఇక కొన్ని రోజులైనా ఉండడం అసాధ్యం అనిపించేలా తయారవుతోంది. ఏ క్షణాన్నయినా పుట్టుక్కు మనే రీతిలోనే వీరి మాటలు కనిపిస్తున్నాయి. అయితే చేసినంత కాలమూ విపరీతమైన భజన చేసి.. ఒక్కసారిగా ఇంత కోపం ఎందుకు వచ్చేసినట్లు? ఇంతగా బెదిరింపుల టోన్ లోకి వారు ఎందుకు వెళ్లిపోయినట్లు.

ఈ పోకడలపై రకరకాల వ్యాఖ్యానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ప్రధానంగా చంద్రాబునాయుడు తరఫు నుంచి రెండు మూడు రకాల లోపాలు- ఆయనను ఇరుకున పెట్టేవి... కేంద్రం వద్ద ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకటి రెవెన్యూ లోటు గురించి లెక్కల్లో తేడా. రెండు- ఓటుకు నోటు కేసు, మూడు- పోలవరం పనుల్లో అవినీతి వంటివి. వీటిలో ఓటుకు నోటు కేసును తిరగతోడేంత 'ఎక్స్ ట్రీమ్' స్టప్ కు మోడీ సర్కారు వెళ్లకపోవచ్చునని అంచనా.

మరి పోలవరం పనుల్లో అవినీతి జరుగుతోందని రాష్ట్ర భాజపా నాయకుల ద్వారా విమర్శలు గుప్పించేయడం వారికి చిటికెలో పని. ఎటూ అందుకోసం సదా సిద్ధంగా ఉండే చంద్రబాబు వ్యతిరేకులు భాజపాలో ఉండనే ఉన్నారు. ఇకపోతే రెవెన్యూలోటు సంగతి.

ఇది చాలా కీలకమైనది. వ్యవహారం చిన్నదే అయినా.. యావత్ ప్రభుత్వం పరువు పోయే వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలకు భిన్నంగా కేంద్రం కేటాయిస్తే గనుక.. రాష్ట్రప్రభుత్వం లెక్కల్లో మోసం చేసినట్లు ... ఆన్ పేపర్ అధికారికంగా.. తేలుతుంది. అలాంటి ఇబ్బంది రాకుండా మంతనాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వం, తెలుగుదేశం, చంద్రబాబునాయుడు పరువు పోయేలా, వారిని నిందితులుగా మార్చేలా.. ప్రజల దృష్టిలో అపనమ్మకం క్రియేట్ అయ్యేలా ఏమాత్రం కేటాయింపుల్లో తేడా చూపినా.. ఇక తెగతెంపులు తప్పవు అనే సంకేతాలు ఇవ్వదలచుకున్నట్లుగా కనిపిస్తోంది అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

పైకి ఎన్ని మాటలు చెప్పుకున్నా.. ఉభయులకూ ఒకరి అవసరం ఒకరికి ఉంది. పోరునష్టం పొందులాభం అనే సూత్రం ఇరువురికీ తెలుసునని.. పైగా రాష్ట్రంలో సొంతంగా ఒక్కసీటునైనా గెలుచుకోవడం డౌటే అనే స్థితిలో ఉన్న భాజపాకు తెలుగుదేశం ఆసరా చాలా అవసరం గనుక.. వారు కటీఫ్ సంకేతాలు ఇస్తున్నారని పలువురు భావిస్తున్నారు.