cloudfront

Advertisement


Home > Politics - Gossip

'దేశం' క్షమాభిక్ష ఫలితం ఇది?

'దేశం' క్షమాభిక్ష ఫలితం ఇది?

వైఎస్ రాజారెడ్డి హంతకులకు క్షమాభిక్ష పెట్టిన ఫలితమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యనా? ఇప్పుడు ఈ అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ హత్య కేసులో కొత్తగా సుధాకర రెడ్డి అనే వ్యక్తి పేరు వినిపిస్తోందట. ఇంతకీ ఎవరు ఈ సుధాకర రెడ్డి అంటే వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో అక్యూజ్డ్ నెంబర్ 8. ఈ కేసులో మొత్తం 13 మందికి యావజ్జీవ శిక్ష విధించింది హైకోర్టు. పైగా సుప్రీంకోర్టు ధృవీకరించింది.

తీరాచూస్తే గత ఏడాది వీళ్లందరికీ క్షమాభిక్ష పెట్టేసింది చంద్రబాబు ఫ్రభుత్వం. చిత్రంగా వైఎస్ రాజారెడ్డి మర్డర్ జరిగినపుడు వున్నది చంద్రబాబు ప్రభుత్వమే. ఇప్పుడు క్షమాభిక్ష పెట్టినపుడు వున్నది, క్షమాభిక్ష పెట్టినది చంద్రబాబు ప్రభుత్వమే.

అలా విడుదలైన సుధాకరరెడ్డి మీదనే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు, బంధువులు అనుమాన పడుతున్నారని వార్తలు వినవస్తున్నాయి. హంతకులకు కోర్టు యావజ్జీవం వేస్తే, వాళ్లకు మధ్యలోనే క్షమాభిక్ష ప్రసాదించేసి, మరో మర్డర్ కు కారకులయ్యిందా? ప్రభుత్వం? నిజానిజాలు తేలితే తప్ప, ఈ ప్రశ్నకు సమాధానం రాదు.