cloudfront

Advertisement


Home > Politics - Gossip

వాణీ విశ్వనాథ్ పాయె.. దివ్యవాణి వచ్చె!

వాణీ విశ్వనాథ్ పాయె.. దివ్యవాణి వచ్చె!

తెలుగుదేశం పార్టీలో మహిళా నటీమణులు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం కొత్త ఏమీ కాకుండా పోయింది. ఆవిర్భావం దగ్గర నుంచి ఈ సినిమా పార్టీలో హీరోయిన్ల గెస్ట్ అప్పీరియన్స్ లు కొనసాగుతూ ఉన్నాయి. ఈ పార్టీలో హీరోయిన్లు కొంతకాలం పనిచేయడం.. అవతల వాళ్ల మీద హద్దూ అదుపులేకుండా మాట్లాడటం.. ఆ తర్వాత చంద్రబాబును తిడుతూ బయటకు వెళ్లడం ఇది కొత్త ఏమీకాదు.

ఈ ప్రక్రియలో తాజా కరివేపాకు దివ్యవాణి. ఈ ‘పెళ్లి పుస్తకం’ హీరోయిన్ ఇటీవలే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టుగా ఉంది. ఢిల్లీలో ఈమె ఓవరాక్షన్ చూసి ఈమెనా.. పెళ్లి పుస్తకం సినిమా హీరోయిన్ అని జనాలు తరిచి చూసుకోవాల్సి వచ్చింది.

ఈమె ఓకే కానీ, తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకూ హడావుడి చేసిన వాణీ విశ్వనాథ్ కనపడటం లేదిప్పుడు. తనకు ఎన్టీఆర్ తో గల అనుబంధం గురించి చెప్పుకుంటూ టీడీపీకి దగ్గరైంది వాణీ. నగరి నుంచి రోజా మీద పోటీ చేయడానికి కూడా ఉత్సాహం చూపించింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ మీద నిప్పులు చెరిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కౌంటర్ సినిమాలో నటిస్తానని చెప్పింది.

అంత హడావుడి చేసిన వాణీ విశ్వనాథ్ అంతే త్వరగా పచ్చ పార్టీకి దూరం అయినట్టుగా ఉంది. వాణీ విశ్వనాథ్ లేకపోతేనేమీ.. దివ్యవాణి వచ్చింది కదా.. పేర్లు కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయి. మరి ఈమె హడావుడి ఎన్ని రోజులో!

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు