cloudfront

Advertisement


Home > Politics - Gossip

జగన్ నో.. మరోనేతకు బాబు పచ్చకండువా!

జగన్ నో.. మరోనేతకు బాబు పచ్చకండువా!

ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలుపుతట్టడం.. అక్కడ నో వెకెన్సీ బోర్డు నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ వైపు చూడటం.. ఈ రాజకీయం సాగుతూ ఉంది ఏపీలో. స్వయంగా తెలుగుదేశం అధికారిక మీడియా వర్గాలే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఉన్నాయి. కర్నూలుజిల్లా సీనియర్ పొలిటీషియన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. ముందుగా కోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారు. అయితే అక్కడ కుదరలేదు. కర్నూలు ఎంపీ టికెట్ కానీ, డోన్ అసెంబ్లీ టికెట్ కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు. డోన్లో బుగ్గనను పక్కనపెట్టే అవకాశమే లేదు.

పార్టీ బలంలేకపోతే అక్కడ కోట్లకు ఉన్న బలం పెద్దగా ఏమీలేదు కూడా. ఇక కర్నూలు ఎంపీ టికెట్ ను బీసీలకు అని జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోట్ల చేరిక కుదరలేదు. ఆయన తెలుగుదేశం వైపు చూడాల్సి వచ్చింది. టికెట్ కుదరదు కానీ.. పార్టీలోకి రమ్మని బాగానే చూసుకుంటామని కోట్లకు జగన్ హామీ ఇచ్చారట. అయితే కోట్ల ప్రత్యక్ష పోటీకి పట్ల ఉత్సాహంతో ఉన్నాడని సమాచారం. టీడీపీలో చేరే విషయమై ఆయన ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఆ సంగతలా ఉంటే.. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేసిన మాజీమంత్రి డీఎల్ ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారట. ఈ విషయాన్ని తెలుగుదేశం అనుకూల మీడియానే చెబుతోంది. డీఎల్ అనుచరులు కొందరు ఇటీవలే ఇడుపులపాయకు జగన్ వచ్చినప్పుడు వెళ్లి కలిశారు. మైదుకూరు అసెంబ్లీ టికెట్ ను డీఎల్ కు కోరారట వాళ్లు. అయితే అక్కడ వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో డీఎల్ కు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారట జగన్. పార్టీలోకి రమ్మని అయితే ఆహ్వానించారట. ప్రత్యక్ష పోటీకి ఛాన్స్ దక్కకపోవడంతో డీఎల్ తెలుగుదేశం వైపు చూస్తున్నారని సమాచారం. డీఎల్ ను చేర్చుకోవడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాన్నాళ్లుగానే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు.

దీంతో డీఎల్ తెలుగుదేశంలోకి చేరడం ఖరారు అయినట్టేనని తెలుస్తోంది. అయితే మైదుకూరు సీటును టీడీపీలో సుధాకర్ యాదవ్ ఆశిస్తున్నారు. అయితే ఆయన ఎలాగూ టీటీడీ చైర్మన్ ఉన్నారు కాబట్టి.. ఒక్కోరికి ఒక్కో అవకాశమే అనే లెక్కతో చంద్రబాబు డీఎల్ కు మైదుకూరు టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?