cloudfront

Advertisement


Home > Politics - Gossip

శెభాష్ ఈనాడు.. తప్పు దిద్దుకునే దమ్మున్న పత్రిక!

శెభాష్ ఈనాడు.. తప్పు దిద్దుకునే దమ్మున్న పత్రిక!

తెలుగులో అగ్ర దినపత్రిక ఈనాడును అభినందించాలి. సాధారణంగా ఈనాడు అంటే.. అత్యంత తాజా వార్తలకు నిదర్శనం. అర్ధరాత్రి తర్వాత జరిగే చాలా సంగతులు.. తెలుగు జాతికి తాము మాత్రమే అందించిన ఘనత ఈనాడుకు ఉంది.

రాజీవ్ గాంధీ మరణం గురించి ఈనాడులో మాత్రమే వార్త ప్రచురితం అయితే.. అబద్ధాలు ప్రచురించారంటూ.. ఆ పత్రిక కాపీలను వీధుల్లో కాంగ్రెస్ వాళ్లు తగులబెట్టారు. (అప్పట్లో ఇంత విస్తృతమైన మీడియాలేదు). ఈనాడు సాధారణంగా ఒకరోజు కిందటే గడచిపోయిన వార్తను, ఇంపార్టెంట్ అయినా సరే ప్రచురించదు. పాచివార్త వేశారనే చెడ్డపేరు కంటె.. ప్రచురించలేదనే చెడ్డపేరు బెటర్ అని వారి భావన.

అలాంటి ఈనాడు ఇవాళ బుధవారం నాడు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో చేసిన ప్రసంగాన్ని శుక్రవారం పత్రికలో ప్రచురించింది. అది కూడా అనూహ్యమైన ప్రాధాన్యంతో ఇచ్చింది. అత్యంత ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలకు మాత్రం ఎలాంటి బీభత్స ప్రయారిటీ ఇస్తారో ఆ రకంగా ఈ వార్తను అందించింది. ఆ రకంగా శెభాష్ అనిపించుకున్నది. కానీ ఇలా ఇవ్వడానికి చాలా వ్యవహారం నడిచింది.

బుధవారం లోక్ సభలో గల్లా జయదేవ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ సంబోధిస్తూ.. చెలరేగిపోయారు. ప్రతి అంశాన్నీ విపులంగా చెప్పారు. ఇంతా అయితే.. ఈనాడులో మాత్రం గురువారం నాడు లోపలి పేజీల్లో చిన్న సైజులో ఒకటిన్నర కాలం వార్త మాత్రమే వచ్చింది.

దీనిపై గురువారం నాడు మీడియా వర్గాల్లో చాలా విమర్శలు వచ్చాయి. గురువారం సాయంత్రానికి ఈనాడు కేంద్ర కార్యాలయానికి కూడా ఈ వార్తకు ఇచ్చిన ప్రయారిటీ గురించి ఫిర్యాదులు తెగ వచ్చి పడ్డాయి. సోషల్ మీడియాలో అయితే ఈనాడు మీద ఒక రేంజిలో విమర్శలు స్ప్రెడ్ అయ్యాయి. ఆ వార్తకు తాము పొరబాటుగా ప్రయారిటీ తక్కువ ఇచ్చాం అని ఈనాడు గుర్తించింది.

సాధారణంగా అయితే అలాంటి తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. కానీ.. ఈనాడు సాహసించి తప్పు దిద్దుకున్నది. అసలు తప్పు ఒప్పుకోవాలంటేనే చాలా గుండె ధైర్యం ఉండాలి. అది తమకున్నదని వారు నిరూపించుకున్నారు.

అసలే ఒకరోజు ముందే జరిగి, పాచిపోయిన వార్త, పైగా గురువారం ఎడిషన్ లో కూడా వచ్చేసిన వార్త.. అయినా సరే.. దానికి దక్కవలసిన ప్రాధాన్యం దానికి దక్కేలాగా.. చాలా విపులంగా శుక్రవారం అందించారు. అందుకు మళ్లీ తెలుగు ప్రజలందరి నమ్మకాన్ని ఈనాడు పొందగలుగుతున్నదనే చెప్పాలి.