cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఎన్నికల భయం.. ఆర్టీసీతో బాబు బేరం

ఎన్నికల భయం.. ఆర్టీసీతో బాబు బేరం

ఎన్నికల సీజన్ లో అడక్కుండానే అన్ని వరాలిస్తున్న చంద్రబాబు.. సమ్మెకు దిగుతామంటూ హెచ్చరించిన ఆర్టీకీ కార్మికుల పట్ల కనికరం చూపకుండా ఉంటారా. అందరూ ఊహించినట్టుగానే ఆర్టీసీ సమ్మె విరమింపచేయడానికి తెలుగుదేశం పార్టీ ముందస్తు వ్యూహంతోనే రంగంలోకి దిగింది. నోటీసు ఇచ్చినరోజు నుంచి.. కాలయాపన చేసి, చివరకు కొన్నిగంటల్లో సమ్మె ప్రారంభం అవుతుందనగా.. ఫిట్ మెంట్ పై ప్రకటన చేసి చప్పట్లు కొట్టించుకుంది.

ఇదంతా చంద్రబాబుకి ఓట్ల మీదున్న ప్రేమే కానీ, ఉద్యోగుల మీదున్న జాలికాదని అందరికీ అర్థమౌతూనే ఉంది. నిజంగా బాబుకు చిత్తశుద్ధి ఉంటే మూడేళ్ల కిందటే ఇది ప్రకటించి ఉండేవారు. అసలు చంద్రబాబు హయాంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యే దాడిలో అవమానాలు ఎదుర్కొన్న మహిళా రెవెన్యూ ఉద్యోగిని అడిగితే ఈ విషయం బాగా చెబుతారు.

ఎంపీ చేతిలో అసమర్థులుగా చిత్రీకరింపబడిన పోలీసు ఇనస్పెక్టర్ ని అడిగితే మరింత బాగా వివరిస్తారు. సీపీఎస్ రద్దుకోసం చేసిన ఉద్యమంలో అక్రమ అరెస్ట్ లకు గురైన ఉపాధ్యాయులు ఇంకా బాగా చెబుతారు ఆ కష్టాలేంటో. ఇక ఆర్టీసీ ఉద్యోగుల సంగతి సరే సరి. పాదయాత్రలో వైఎస్ జగన్ తో ఫొటో దిగినందుకే ఒక కండెక్టర్, డ్రైవర్ షోకాజ్ నోటీసులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఉద్యోగులపై ఇంతటి 'ప్రేమ' చూపిస్తున్న చంద్రబాబు, ఆర్టీసీ కార్మికులపై కలలో కూడా ఊహించిన ఔదార్యం చూపించారంటే ఎవరైనా నమ్ముతారా. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే తాత్కాలికంగా 25శాతం ఫిట్ మెంట్ ని ఇస్తున్నట్టు ప్రకటించారు.

వేతన సవరణ బకాయిలపై మాత్రం పిల్లిమొగ్గలు వేశారు. 2020 నాటికి వేతన సవరణ బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని అన్నారు. అంటే మళ్లీ అధికారంలోకి వస్తే ఇస్తారు, వచ్చినప్పటికీ ఇస్తారన్న గ్యారెంటీ లేదన్నమాట.

ఈ ఫిట్ మెంట్ సంగతి పక్కనపెడితే.. ఇవాళ్టి నుంచి ఆర్టీసీ కార్మికులతో కూడా ప్రతి బస్టాండ్ లో చంద్రబాబు తన ఫొటోలకు పాలాభిషేకం చేయించుకోవడం ఖాయం. ప్రతి బస్సుపైనా థ్యాంక్యూ సీఎం సార్ అనే స్టిక్కర్ వేయించుకోవడం అంతకంటే ఖాయం. ఎనీ డౌట్స్.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?